తెలంగాణ పైనా చంద్రబాబు ఫోకస్ .. త్వరలోనే అక్కడ ?
TeluguStop.com
ఏపీలో టిడిపి( TDP ) ఘనవిజయం సాధించడంతో , ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంచి జోష్ లో ఉన్నారు.
త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల్లో 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, పొత్తులో ఉన్న జనసేన 21 , బిజెపి మూడు స్థానాల్లో విజయం సాధించాయి.
ఇక వైసిపి కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.ఎంపీల విషయానికొస్తే టీడీపీ 16 ,జనసేన 2 ,బిజెపి 3 ,వైసీపీ నాలుగు స్థానాలను దర్శించుకున్నాయి.
ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏపీలో అధికారం దక్కడంతో తెలంగాణలోనూ టిడిపిని బలోపేతం చేసే విషయంపై ఫోకస్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. """/" /
రాష్ట్రంలో మళ్లీ టీడీపీకి పునర్వైభవం తీసుకువచ్చే విషయంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
తెలంగాణలో బీఆర్ఎస్( BRS In Telangana ) బాగా బలహీనం కావడం, ఆ పార్టీలోని నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతుండడంతో, ఇదే సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు.
గతంలో టిడిపి నుంచి బీఆర్ ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ లలోకి అనేకమంది వలస వెళ్లారు.
అయినా టిడిపికి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండడంతో, బీఆర్ఎస్ నుంచి మళ్లీ టిడిపిలోకి వలసలు ఉంటాయని, ఆ దిశగా పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
అందుకే బీఆర్ఎస్ స్థానాన్ని టిడిపి భర్తీ చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. """/" /
తెలంగాణ పార్టీ నాయకులతో మరోసారి భేటీ అయ్యి, పార్టీని బలోపేతం చేసే విషయం పైన, చేరికల పైన చర్చించాలని నిర్ణయించుకున్నారట.
అలాగే తెలంగాణ టిడిపి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండడంతో, దానిని కూడా భర్తీ చేసి తెలంగాణలో బలమైన పార్టీగా టిడిపిని బలోపేతం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు.
చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!