కాంగ్రెస్ తో బీఎస్పి దోస్తీ.. కలిసివచ్చేనా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణలో కేవలం కాంగ్రెస్( Congress ) మరియు టిఆర్ఎస్ మధ్య పోటీ ఉండేది.

ఈ రెండు పార్టీలే అత్యధిక ఫాలోయింగ్ ఉన్నటువంటి పార్టీలు.అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్(KCR) సారథ్యంలో మొదటిసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్( CONGRESS ) పూర్తిగా చతికిల పడిపోయింది.కొన్ని సీట్లు గెలిచినా వారు కూడా కేసీఆర్ కు పేవర్ గానే ఉంటూ వచ్చారు.

ఆ తర్వాత 2018 లో మరోసారి ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా కేసీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్( TRS ) అధికారంలోకి వచ్చింది.

ఆ సమయంలో గెలిచినటువంటి కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ విధంగా రెండు పర్యాయాలు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ టిఆర్ఎస్ ను కాపాడుకుంటూ వచ్చారు.

ప్రస్తుతం ఆ టిఆర్ఎస్, బిఆర్ఎస్ గా మారింది.ఈసారి బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ సమక్షంలో అనేక వ్యూహాత్మక ఆలోచనలు చేస్తున్నారు.

ఇప్పటికే 115 సీట్లను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.ఇదే తరుణంలో కాంగ్రెస్ ఎలాగైనా కేసీఆర్( KCR ) ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.

వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.మూడు సభలు, ఆరు స్పీచ్ లు అన్న విధంగా దూసుకెళ్తోంది.

"""/" / ఇప్పటికే ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో సభ నిర్వహించి ఖమ్మం అగ్ర నేతలైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది.

ఇదే తరుణంలో కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మరింత ఊపు వచ్చింది.

ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ అని ప్రజలు కూడా భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి( REVANTH ) సమక్షంలో అనేక వ్యూహాత్మక ఆలోచనలు చేస్తోంది.

ఈ తరుణంలోనే ఈనెల 16వ తేదీన సిడబ్ల్యుసి సమావేశం ఏర్పరిచి 17న భారీ బహిరంగ సభను 10 లక్షల మందితో నిర్వహించాలని భావిస్తోంది.

ఈ సమావేశానికి సోనియా,( SONIA ) రాహుల్,( RAHUL ) ప్రియాంక,( PRIYANKA ) మల్లికార్జున ఖార్గే( MALLI KARJUNA )తో పాటుగా పలువురు రాష్ట్రాల కీలక నేతలు కూడా పాల్గొననున్నారు.

ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు కూడా తీసుకో నున్నారు.

"""/" / ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు కూడా చేరిక కాబోతున్నారట.

అయితే ఈ సమావేశాలకు సిపిఐ మరియు బిఎస్పి పార్టీలకు ఆహ్వానం కూడా ఉందట.

అయితే రాబోవు ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని అడగనున్నారట.

ఒకవేళ బిఎస్పి( BSP అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS PRAVEEN KUMAR ) ఈ విషయానికి సమ్మతిస్తే మాత్రం కాంగ్రెస్ కు చాలా నియోజకవర్గాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది.

దీని ద్వారా ఈజీగా గెలుపు తీరాలకు వెళ్ళవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి చూడాలి కాంగ్రెస్ తో పని చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఒప్పుకుంటారా లేదంటే సొంతంగానే పోటీ చేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

దేవర సినిమా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందా..?