కేసిఆర్ కు ఎందుకంత దైర్యం.. ఏం చూసుకొని ?
TeluguStop.com
బిఆర్‌ఎస్ ( BRS )తో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసిఆర్( KCR ).
ఇతర రాష్ట్రాలలో పార్టీని బలపరిచేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు.ముఖ్యంగా ఏపీలో బిఆర్‌ఎస్ ను ప్రధాన పార్టీగా మలచాలని కేసిఆర్ చేస్తున్న ప్రయత్నలు అన్నీ ఇన్ని కావు.
ఇప్పటికే ఏపీలో తోట చంద్రశేఖర్( Thota Chandrasekhar ) ను బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమించిన కేసిఆర్.
జిల్లాల వారీగా పార్టీని విస్తరించి ఇంచార్జ్ లను కార్యదర్శాలను నియమించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఇక ఏపీ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ పార్టీ బలపేత కార్యకలాపాలు చేపడుతూ అందరి దృష్టి బిఆర్‌ఎస్ పై పడేలా చూస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ లోకి చేరికలు భారీగా పెరగనున్నాయని కూడా ఆయన చెబుతున్నారు.
"""/" /
దీంతో రోజురోజుకూ బిఆర్‌ఎస్ కు సంబంధింకిన చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
కాగా ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండడంతో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుందా ? లేదా ఏదైనా పార్టీతో కలిసి వెళ్లబోతుందా ? అనే దానిపై కూడా మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ఆ మద్య వైసీపీతో బిఆర్‌ఎస్ కలిసి నడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.
కానీ తాను ఎవరితోనూ కలిసే ప్రసక్తి లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు.
జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే బిఆర్‌ఎస్ కు కలిసినేందుకు జగన్ సిద్దంగా లేరనే విషయం అర్థమౌతోంది.
అలాగే జనసేనతో కూడా బిఆర్‌ఎస్ కలవబోతున్నట్లు వార్తలు వినిపించాయి.అదేం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.
ఇక మిగిలింది టీడీపీ.చంద్రబాబు పేరు ఎత్తగానే మండి పడే కేసిఆర్.
టీడీపీతో కాళీసే ప్రసక్తే లేదు. """/" /
దాంతో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందా ? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఇక ఈ ప్రశ్నలన్నిటికి పులిస్టాప్ పెడుతూ ఏపీ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఏపీలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.దాంతో ఒక్కసారిగా పోలిటికల్ హిట్ పెరిగింది.
ఇప్పటివరకు వైసీపీ మాత్రమే 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.టీడీపీ జనసేన పార్టీలు ఆ విషయంలో ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి.
కానీ బిఆర్‌ఎస్ మాత్రం 175 స్థానాల్లోనూ పోటీకి సై అంటోంది.మరి కేసిఆర్ ఎందుకు అంత దైర్యంగా అన్నీ స్థానాల్లో పోటీకి సై అంటున్నారనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.
175 స్థానాల్లో బిఆర్‌ఎస్ పోటీ చేయడం వల్ల టీడీపీ ఓటు బ్యాంకు కు భారీగా గండి పడే అవకాశం ఉంది.
అది కాస్త వైసీపీకి మేలు చేసే అవకాశం ఉంది.వైఎస్ జగన్ మరియు కేసిఆర్ మద్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి.
దాంతో వైసీపీతో ప్రత్యక్షంగా చేతులు కలపకుండా పరోక్షంగా కేసిఆర్ ఇలా మేలు చేస్తున్నారనే అభిప్రాయం కొందరు వెళ్ళబుచ్చుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024