కాంగ్రెస్ కు బి‌ఆర్‌ఎస్ అలా చెక్ పెడుతుందా ?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణతో పాటు హామీల అమలు వైపుగా కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇకపోతే కాంగ్రెస్ ముందు రోజుల్లో ప్రవేశ పెట్టబోయే బిల్లుల విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

శాసనసభలో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికి శాసన మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తప్పెలా లేదు.

ఎందుకంటే కాంగ్రెస్ తరుపున కేవలం జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మాత్రమే శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు.

"""/" / మిగిలిన మెజారిటీ సభ్యులంతా బి‌ఆర్‌ఎస్( BRS ) వారే ఉండడం కాంగ్రెస్ సర్కార్ ను కొంత ఇబ్బంది పెట్టె అంశం.

ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేయడంలోనూ కొత్త విధానాలను ప్రవేశ పెట్టడంలోనూ ఉభయ సభల ఆమోదం తప్పనిసారి.

శాసన మండలిలో 40 స్థానాలకు గాను ప్రస్తుతం 34 స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ సభ్యులే ఉన్నారు.

ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు,  ఇద్దరు ఏంఐఏం సభ్యులు అలాగే కాంగ్రెస్ నుంచి మాత్రం కేవలం ఒక్కరే సభ్యత్వం కలిగి ఉన్నారు.

దీంతో శాసన మండలిలో కాంగ్రెస్ కు మజారిటీ స్థానాలు వచ్చే వరకు ఇబ్బందులు తప్పవనే చెబుతున్నారు రాజకీయ  విశ్లేషకులు.

"""/" / ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా ప్రారంభించినప్పటికి ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ వడి వడిగా అడుగులు వేస్తోంది.

మరో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెబుతోంది.అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కుంభకోణం, ధరణి పోర్టల్( Dharani ) కు సంబంధించిన మార్పులు.

ఇలా చాలా అంశాలే ఉభయసభల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ప్రవేశపెట్టె బిల్లులకు తీర్మానాలకు శాసన మండలిలో బి‌ఆర్‌ఎస్ నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి బి‌ఆర్‌ఎస్ అలా చెక్ పెట్టె అవకాశం ఉందనేది కొందరి వాదన.

మరి ముందు రోజుల్లో అసెంబ్లీ వేదికగా ఇరు పార్టీల మద్య ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

అర్జెంట్ గా శంకర్ కి ఒక రైటర్ కావాలా..? భారతీయుడు 2 సినిమాలో అదే లోటు కనిపించిందా..?