బీజేపీ విమర్శనాస్త్రం బెడిసికొడుతుందా ?

ఈ ఏడాది జరుగుతున్నా ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ( BJP )కీలకంగా తీసుకున్న సంగతి విధితమే.

తెలంగాణ, రాజస్తాన్, మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం.ఈ ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికలు వచ్చే పార్లమెంట్ ఎనికలపై ప్రభావితం చూపే అవకాశం ఉందని, అందుకే ఎలాగైనా ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలని బీజేపీ మొదటి నుంచి గట్టి పట్టుదగా ఉంది, ముఖ్యంగా తెలంగాణ, రాజస్తాన్, మద్యప్రదేశ్ వంటి రాష్ట్రాలను అత్యంత కీలకంగా తీసుకుంది.

ప్రస్తుతం మద్య ప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS ) అధికారంలో ఉన్నాయి.

"""/" / అందువల్ల ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇచ్చి అధికారం చేజిక్కించుకుంటే.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా సత్తా చాటడం గ్యారెంటీ అనే భావనతో ఉన్నారు కమలనాథులు.

అయితే ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అంతా తేలికైన పని కాదు.

మద్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది.అందుకే ఆ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ తీసేలా కాంగ్రెస్ పై విమర్శలు సంధించడమే మెయింట్ టార్గెట్ గా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు.

ఇటీవల మోడీ ( ,Narendra Modi )మరియు అమిత్ షా ( Amit Shah )ప్రసంగాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అశోక్ గెహ్లాట్.వంటి ఇతరత్రా నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మోడీ మరియు అమిత్ షా.

"""/" / అటు తెలంగాణలో కూడాకే‌సి‌ఆర్( CM Kcr )టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు సర్వసాధారణం అయినప్పటికి.తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

బీజేపీలో ఆ క్లారిటీ మిస్ అయిందనేది కొందరి అభిప్రాయం.ఎన్నికల ప్రచారల్లో విమర్శలు సంధించడానికే పూర్తి సమయం వేచిస్తున్నారు తప్పా హామీలు వాటి అమలు, గతంలో చేసిన అభివృద్ది వంటి అంశాలపై ఎక్కడ స్పందించడం లేదు.

ఇదే విధానాన్ని బీజేపీ మొదటి నుంచి ఫాలో అవుతున్నప్పటికి.ఈసారి బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.

మరి కాషాయ పెద్దలు చేస్తున్న విమర్శలు బీజేపీకి ప్లేస్ అవుతాయా ? లేదా మైనస్ అవుతాయా అనేది చూడాలి.

పాదాలు అందంగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!