పవన్ చెప్పినట్లు బీజేపీ చేస్తుందా?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్‌లో ఉన్నాయి.
దీంతో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది.తాజాగా బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కటీఫ్ చెప్పడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఇటీవల ఏపీలో ప్రధాని మోదీ టూర్‌కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.కారణాలు ఏవైనా ప్రధాని టూర్‌లో పవన్ పాల్గొనకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తాను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అయితే నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి రోడ్ మ్యాప్‌ను జనసేనకు అందించిన దాఖలాలు లేవు.
అనంతరం జనసేన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన పవన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు.
బీజేపీ-టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదా కేవలం బీజేపీతో కలిసి పోటీ చేయడం లేదా ఒంటరిగా పోటీ చేయడం అని పవన్ తన మూడు ఆప్షన్లను బహిరంగంగానే ప్రకటించారు.
అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు.కానీ ఆయన నుంచి పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఆహ్వానం లభించలేదు.
తమ కూటమి తరఫున పవన్ కళ్యాణ్‌ను జేపీ నడ్డా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఇలాందేమీ చోటు చేసుకోలేదు. """/" /
మరోవైపు జూలై 22న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి రావాలని పవన్‌ను బీజేపీ ఆహ్వానించింది.
అయితే పవన్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటంతో ఆయన ఈ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు.
దీంతో బీజేపీపై పవన్ అలిగారని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బీజేపీ తనను బుజ్జగించాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే పవన్‌ను తాము బుజ్జగిస్తే ఆయన డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందని.అందుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ నేతలు చెప్తున్నారు.
తాజా పరిణామాలతో బీజేపీతో పవన్ ఎప్పుడు కటీఫ్ చెప్తారోనని అందరూ వేచి చూస్తున్నారు.
హీరోయిన్ కీర్తి సురేష్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా.. ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!