యూఎస్ పౌరసత్వంపై ట్రంప్ కొత్త విధానం .. బారన్ ట్రంప్‌పై ప్రభావం చూపుతుందా?

వలసలకు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) వ్యతిరేకమన్న సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్.

ఈసారి ఇమ్మిగ్రేషన్ విధానంలో( Immigration Policies ) ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని వలసదారులు బిక్కుబిక్కుమంటున్నారు.

అయితే ట్రంప్ తీసుకురావాలని అనుకుంటున్న ఓ విధానం స్వయంగా ఆయన కుమారుడు బారన్ ట్రంప్‌పైనే( Barron Trump ) ప్రభావం చూపుదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి.

"""/" / జన్మత: అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రణాళిక అతని చిన్నకుమారుడు బారన్ ట్రంప్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

డీనేచురలైజేషన్ ప్లాన్ ప్రకారం.బారన్ ట్రంప్‌ను బహిష్కరించాలని, అతను తన తల్లికి అమెరికా పౌరసత్వం( US Citizenship ) రావడానికి 3 నెలల ముందు జన్మించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అంటే ట్రంప్ విధానాలకు అనుగుణంగా బారన్ ట్రంప్ అమెరికా పౌరుడు కాదని, అతను దేశాన్ని వీడాల్సి ఉంటుందని అంటున్నారు.

"""/" / అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనాలను యూఎస్ఏ టుడే Fact - Check నిర్వహించి తప్పు అని ప్రకటించింది.

బారన్ అమెరికా పౌరుడని.ట్రంప్ తీసుకురావాలని అనుకుంటున్న విధానం అతని పౌరసత్వ స్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయదని తెలిపింది.

ట్రంప్ ప్రతిపాదన భవిష్యత్‌లో పుట్టబోయే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయిన తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు ఇది వర్తించదని యూఎస్ఏ టుడే తెలిపింది.

14వ రాజ్యాంగ సవరణ ప్రకారం.గడిచిన 150 ఏళ్లలో అమెరికాలో జన్మించిన వారికి యూఎస్ పౌరసత్వం మంజూరు చేయబడుతుంది.

అయితే ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు యూఎస్ పౌరులు కారు.

అలాంటి ప్రతిపాదన అమల్లోకి వచ్చినప్పటికీ బారన్ పౌరసత్వ స్థితిని ప్రభావితం చేయదని నిపుణులు పేర్కొంటున్నారు.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…