ఎన్టీఆర్ ను అలా మాట్లాడితే బాలకృష్ణ బాధపడరా… బాలయ్య వివాదం పై రోజా కామెంట్స్!
TeluguStop.com
వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతున్నాయి.
వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున నిర్వహించారు.
అయితే పొరపాటున బాలకృష్ణ నోరు జారారా లేక ఉద్దేశపూర్వకంగా అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడారో తెలియదు కానీ అక్కినేని జయంతి రోజున అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదంగా మారాయి.
"""/"/
ఈ క్రమంలోనే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా స్పందిస్తూ కళామతల్లి ముద్దుబిడ్డలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి నటులను అవమానపరిస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్టే అంటూ బాలకృష్ణకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
"""/"/
ఇలా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అయితే ఈ వివాదం పై మంత్రి, సినీనటి రోజా స్పందించారు.బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు.
ఇదే వ్యాఖ్యలే ఎన్టీఆర్ గురించి మాట్లాడితే నందమూరి ఫ్యామిలీ బాధపడదా.ఇలా అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా తన అభిప్రాయాలను తెలియజేశారు.
ప్రస్తుతం రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ ఎవరవుతారు..?