మునుగోడు గడ్డ బహుజనుల అడ్డగా మారే సమయం ఇదేనేమో...

మన దేశంలోని రాజ్యాంగం ద్వారా సామాన్య ప్రజలు కూడా రాజ్యాధికారం పొందవచ్చని చెప్పబడింది.

కానీ మునుగోడు నియోజకవర్గ పరిస్థితిని గమనిస్తే.ఆలా అనిపించుట లేదు 1967 లో మునుగోడు నియోజకవర్గం ఏర్పాటు జరిగింది.

ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బహుజన సామజికవర్గాల ప్రజలు ఉంటారు.వారి ఓట్లు అధికంగా ఉన్నాయి కానీ బహుజనులకు ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు.

ఇది చరిత్ర చెపుతున్న సత్యం మరియు నిజం కూడా ఇదే.ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ బహుజన నాయకున్ని ఎదగనివ్వడం లేదు.

ఎందుకంటే 1967 నుండి నేటి వరకు ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులే అధికారం పొంది పాలకులుగా ఉంటున్నారు.

ఎంత అన్యాయమైన విషయమంటే ఈ నియోజకవర్గంలో బహుజనుల ఓట్లు 91.16% ఉండగా 8.

84% ఓట్లు మాత్రమే ఉన్న ఆధిపత్య సామజిక వర్గాలకు చెందిన నాయకులే మునుగోడు ప్రజలపై అధికారం చెలయిస్తున్నారు.

ఆ విషయం పరిశీలన చేస్తే 1967, 1972, 1978, 1983, నాలుగుసార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తర్వాత 1985, 1989, 1994 లలో ఉజ్జయిని నారాయణ రావు గెలిచారు.

ఆ తర్వాతి 1999 ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరోసారి గెలిచారు.2004 లో పల్లా వెంకట రెడ్డి, 2009 లో యాదగిరి రావు, 2014 లో ప్రభాకర్ రెడ్డి గెలుపొందగా, 2018 లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు.

ఇలా నాటి నుండి నేటిదాకా ఆధిపత్య సామజిక వర్గాల నాయకులే మునుగోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

కానీ బహుజనులకు ఆ అవకాశం ఇప్పటి వరకు రాలేదు, వివిధ రాజకీయ పార్టీలు ఆ అవకాశం కల్పించలేదు కూడా.

సామాజిక ఉద్యమ నేతలు ప్రజా ఉద్యమ కారులు, ప్రజా స్వామ్య వాదులు అన్ని రాజకీయ పార్టీలను మంచి మనస్సుతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో అధికారం పొందే అవకాశం బహుజనులకు ఇవ్వాలని కోరుతున్నారు.

"""/"/ లేకుంటే పోరాడి అధికారం పొందే పరిస్థితులు వస్తాయింటున్నారు.ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో బహుజనులకు చెందిన అభ్యర్థులకు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వాలని బహుజన సామాజిక ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

తప్పకుండా.ఈ సారీ బహుజన ప్రజలు బహుజన నాయకున్ని గెలిపించుకుంటారని అన్ని రాజకీయ పార్టీలకు బహుజన ఉద్యమ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బహుజనులను అధికారానికి దూరంగా ఉంచకుండా.బహుజనులకు అధికారాన్ని ఇవ్వాలని పార్టీలను కోరుతున్నారు.

"""/"/ బహుజన నాయకుడే ఈ సారి మునుగోడు నియోజకవర్గం నుండి అసెంబ్లీకి వెళ్లాలని బహుజన ప్రజలు నిర్ణయించడం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమనించాలని రాష్ట్ర బహుజన ఉద్యమ నాయకులంటున్నారు.

ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో విజేతను నిర్ణయించేది బహుజన సామాజిక వర్గాల ప్రజల ఓట్లేనని కచ్చితంగా చెప్పవచ్చు.

మునుగోడు నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారో.? ఏ కులస్తుల ఓట్లు ప్రభావం చూపుతాయో.

అనే అంశంపై నియోజకవర్గంలోని వివరాలు గమనిస్తే అవి ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలో మొత్తం 2,20,520.

ఓటర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి.అవి నియోజకవర్గంలో ఒక సామజిక విధానం ప్రకారం కులాల వారీగా ఓట్లు ఇలా ఉన్నాయని నిపుణుల అంచనాలు చెపుతున్నాయి.

థియేటర్ లో మహేష్ మురారి మూవీ చూస్తూ పెళ్లి చేసుకున్న జంట.. ఏం జరిగిందంటే?