నవంబర్ నుంచి జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారా?
TeluguStop.com
పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టలేదు.
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరోనా రావడంతో జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారు.
అయితే వివిధ పథకాలను ప్రారంభించడానికి తప్ప ఆయన తాడేపల్లి నుంచి అడుగు బయటకు పెట్టడం లేదు.
మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు చంద్రబాబు వయసు మీదా పడినా విరామం లేకుండా కాళ్ళకు బలపం కట్టుకుని జిల్లాలను చుట్టేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దసరా నుంచి బస్సు యాత్ర పేరుతో ఏపీ అంతా చుట్టేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
దీంతో జగన్ కూడా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.సీఎం హోదాలో పాదయాత్రలు చేయడం సాధ్యం కాదు కాబట్టి రచ్చబండ పేరుతో గ్రామాలకు వెళ్లాలని జగన్ యోచిస్తున్నారు.
ఈ ఏడాది నవంబర్ నుంచి జగన్ బస్సు యాత్ర చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
"""/" /
2017, నవంబర్ 6న జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించి అధికారంలోకి వచ్చారు.
2024లోనూ అధికారం చేపట్టి టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలని ఫిక్స్ అయిన జగన్ సెంటిమెంట్ ప్రకారం మరోసారి నవంబర్ 6 నుంచే రచ్చబండ చేపట్టాలని భావిస్తున్నారు.
పల్లెలకు, గ్రామాలకు వెళ్లడం ద్వారా అక్కడ రచ్చబండ వద్ద కూర్చుని తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వారికి వివరిస్తూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇదే అంశంపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గాల సమీక్షలకు వెళ్లిన సమయంలో ఆర్ధికంగా అక్కడ వచ్చే అభ్యర్ధనలను విని వెంటనే నిధులు మంజారు చేయాల్సి ఉంటుంది.
వాస్తవానికి గతంలోనే రచ్చబండను ప్రారంభించాలని జగన్ భావించినా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేశారని తెలుస్తోంది.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండంతో రచ్చబండ కార్యక్రమాన్ని ఎలాగైనా నిర్వహించాలని జగన్ కృతనిశ్చయంతో కనిపిస్తున్నారు.
వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!