సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తున్నారా ?
TeluguStop.com
కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరుని( Daggubati Purandeshwari ) అధ్యక్షురాలుగా నియమించారు .
వచ్చే ఎన్నికల వరకు దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, బిజెపికి పట్టున్న ప్రాంతాలతో పాటు, బిజెపి కి ఆదరణ దక్కి అవకాశం ఉన్న ప్రాంతాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టమన్నారు.
తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇక తమతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఆ పార్టీని కలుపుకు వెళ్లేందుకు బిజెపి అగ్రనేతలు ఎవరు ఇష్టపడడం లేదు.
"""/" /
గతంలో టిడిపి బీజేపీ పొత్తు కొనసాగిన సమయంలోను, ఆ తరువాత టిడిపి నేతలు వ్యవహరించిన తీరును ఇప్పటికీ బిజెపి అగ్ర నేతలు ఎవరు మర్చిపోవడం లేదు.
అందుకే టిడిపి అంశాన్ని పక్కనపెట్టి జనసేన, బిజెపి సొంతంగా బలోపేతం అయ్యేవిధంగా వ్యూహరచన చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్డిఏ భాగస్వామ్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న బిజెపి జనసేనకు( Janasena ) ఆహ్వానం అందించింది.
కానీ టిడిపికి ఆహ్వానం అందకపోవడంతో ఆ పార్టీని దూరం పెడుతున్నారని విషయం అర్థం అవుతోంది.
ఎన్ డి ఏ మీటింగ్ కు వెళ్లేందుకు ఆసక్తితో ఉన్నారు.ఒకరోజు ముందుగానే ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నేతలతో భేటీ అవ్వాలనే ప్లాన్ తో ఉన్నారు .
ఈ సమావేశం ముగిసిన తర్వాత పవన్ తో ( Pawan Kalyan )బిజెపి అగ్ర నేతలు చర్చించి , అవసరమైతే రెండు పార్టీల తరపున సీఎం అభ్యర్థిగా( CM Candidate ) పవన్ ను ప్రకటించే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది .
ఏపీలో బిజెపి , జనసేన బలోపేతం కావాలంటే టిడిపి , వైసిపిలు బలహీనపడితేనే అది సాధ్యమవుతుందని బిజెపి అగ్ర నేతలు నమ్ముతున్నారు.
"""/" /
ఏపీలో వైసీపీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఉంది .మైనారిటీలు, దళితులు , గిరిజనులు ఇలా కొన్ని కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు పూర్తిగా వైసిపికి మద్దతుగా ఉండగా , టిడిపికి కమ్మ సామాజిక వర్గం అండదండలు ఉండడంతో, జనసేన ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షరాలుగా నియమితులైన దగ్గుబాటి పురందరేశ్వరి తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ఆమె ద్వారా టిడిపిలోని కీలకమైన నేతలను బిజెపిలోకి తీసుకువచ్చి ఆ పార్టీని బలహీనం చేయాలని బిజెపి పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.
ఇక పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాజకీయంగా పై చేయి సాధించవచ్చనే ప్లాన్ తో ఉన్నారట .
మరో మూవీని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్.. ఈ హీరోయిన్ వెళ్తున్న రూట్ రైటేనా?