ఏపీ అసెంబ్లీ చివ‌ర‌కు అంత దిగ‌జారిందా ?

ఔను! ఏపీ అసెంబ్లీ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన మేధావులు ఇదే మాట అంటున్నారు.తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లోను, అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఈ ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రి లోనూ ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అసెంబ్లీలో రైతుల‌కు సంబంధించిన ఇన్ పుట్ స‌బ్సిడీ, వ‌రద న‌ష్టం ప‌రిహారం వంటి విష‌యాల‌పై చ‌ర్చ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలోనే త‌మ‌కు స‌మ‌యం కేటాయించాల‌ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు కోరడం స‌భాప‌తి స‌మ‌యం ఇవ్వ‌డం.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు జోక్యం చేసుకోవ‌డం వివాదానికి దారితీసింది.ఇది స‌భ‌లోనే తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఏం పీక్కుంటావో పీక్కో అంటూ క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్‌ఖాన్‌పై చంద్ర‌బాబు ప‌రుష ప‌దజాలం ప్ర‌యోగించ‌డంతో వైసీపీ నుంచి స‌హ‌జంగానే ఎదురు దాడి ప్రారంభ‌మైంది.

దీంతో బాబు మైక్ క‌ట్ అయింది.వెంట‌నే ఆయ‌న పోడియం ముందుకు వ‌చ్చి చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఆయ‌న బైఠాయించారు.

ఇది సంచ‌ల‌న‌మే.అయితే దీనికి కొన‌సాగింపుగా స‌భాప‌తి టీడీపీ స‌భ్యులు అంద‌రినీ మూకుమ్మ‌డిగా స‌స్పెండ్ చేశారు.

"""/"/ దీనిని నిర‌సిస్తూ చంద్ర‌బాబు మీడియా మీటింగ్ పెట్టి సీఎం స‌హా మంత్రుల‌పై విరుచుకుప‌డిన తీరు మ‌రిన్ని వివాదాల‌కు కేంద్రంగా మారిపోయింది.

సీఎంను, మంత్రుల‌ను చంద్ర‌బాబు తొలిసారి వాడు-వీడు అని సంబోధించ‌డంతో మంత్రి కొడాలి నాని ఏకంగా అరెయ్ ఒరేయ్ అని చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

ఈ ప‌రిణామాలు గ‌మ‌నించిన మేథావులు రాబోయే రోజుల్లో స‌భ మ‌రింత ర‌ణ‌రంగంగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో త‌ప్పు ఎవ‌రిద‌నేది ప‌క్క‌న పెడితే సీనియ‌ర్‌గా సంబాళించుకుని మాట్లాడాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకే ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే నానాటికీ దిగ‌జారుతున్న టీడీపీ రేషియో కార‌ణంగా ఆయ‌నలో పెరుగుతున్న అస‌హ‌నం ఈ వివాదాల‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది.

విచిత్రం ఏంటంటే.ఇన్నాళ్లు చంద్ర‌బాబును వెనుకేసుకువ‌చ్చిన ఆయ‌న అనుకూల మీడియా కూడా ఇప్పుడు బాబు వ్య‌వ‌హారాన్ని స‌మ‌ర్ధించ‌లేక పోవ‌డం.

సో  మొత్తానికి స‌భ గాడి త‌ప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

కుప్పం అభ్యర్థిగా రేపు చంద్రబాబు నామినేషన్