అనిల్ రావిపూడి బాలయ్య కి ఇచ్చిన సక్సెస్ నే వెంకటేష్ కి కూడా ఇస్తాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ నటులు చాలామంది ఉన్నారు.
అందులో విక్టరీ వెంకటేష్( Daggubati Venkatesh ) ఒకరు.ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
తన గత సినిమా అయిన సైందవ్ సినిమా నిరాశపరిచినప్పటికీ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా రీసెంట్ గా షూట్ స్టార్ట్ అయింది.అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
"""/" /
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనియాంశంగా మారింది.
ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారంటీగా ఉంటుంది.
కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతో వెంకటేష్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ హిట్ విజయం నమోదు అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక మొత్తానికైతే వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో మూడో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇంతకు ముందు బాలయ్య బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా( Bhagavanth Kesari ) మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఇక అదే రూట్ లో వెంకటేష్ కి కూడా మంచి విజయాన్ని ఇచ్చి ఆయనని కూడా సక్సెస్ ఫుల్ హీరోగా మార్చాలనే ఉద్దేశ్యం లో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది.
అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!