చిరంజీవి సినిమాతో అనిల్ రావిపూడి పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే అందరికీ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గుర్తుకొస్తాడు.

ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేయడమే కాకుండా మెగాస్టార్ అనే హోదాను కూడా సంపాదించి పెట్టాయి.

ప్రస్తుతం ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నాడు.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్నదిగా ఉండబోతుందట.

"""/" / మొత్తానికైతే అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక దానికి తనకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరితో పోటీపడి తను కూడా సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఇండస్ట్రీలో ఉన్న ఇతర దర్శకులతో పోటీ పడగలిగే కెపాసిటి అతనికి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

"""/" / తన తోటి దర్శకులందరు పాన్ ఇండియా నేపధ్యం లో సినిమాలు చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

మరి తను పాన్ ఇండియాలో సినిమా ఎప్పుడు చేస్తాడు.ఇతర దర్శకుల మాదిరిగా తను ఎప్పుడు ఎదుగుతాడనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరు ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.

ఇదేం దరిద్రం.. మిగిలిపోయిన ఇండియన్ ఫుడ్‌తో కేక్.. చెఫ్‌పై నెటిజన్లు ఆగ్రహం..