ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పురాణాలను( Puranas ) కథలుగా ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు.

అయితే ఉన్నది ఉన్నట్టుగా పురాణాలను చూపిస్తే పర్లేదు.కానీ పురాణాలను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారు అంటూ రీసెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో.

పాటల రచయిత గుర్తింపును సంపాదించుకున్న 'అనంత్ శ్రీరామ్'( Ananth Sriram ) ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా కల్కి సినిమా( Kalki Movie ) మీద ఆయన కొన్ని కామెంట్లను కూడా చేశారు.

ఇక ఇలాంటి సినిమాలు మనం చూడడం అవసరమా అనే విధంగా మాట్లాడాడు.మరి మొత్తానికైతే అనంత్ శ్రీరామ్ ఎందుకలా మాట్లాడాడు అనే దానిమీద చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.

అనంత్ శ్రీరామ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అని కొంతమంది భావిస్తుంటే, మరి కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీ గురించి అనుచిత వాక్యాలు చేయడం సరైన విషయం కాదు.

"""/" / తన అభిప్రాయం ఏదైనా ఉంటే సినిమా యూనిట్ తో మాట్లాడుకోవాలి.

అంతే తప్ప బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సినిమాలను తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుందంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం అనంత్ శ్రీరామ్ ను తప్పు పడుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు లిరిసిస్ట్ గా కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు.

"""/" / ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు అవకాశాలు వస్తాయా రావా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటేనే ఇక్కడ ఎక్కువ అవకాశాలైతే వస్తాయి.

లేకుండా ఇబ్బందులు పడాల్సి అవసరం అయితే రావచ్చు.ఇక చిన్న కాంట్రవర్శి ల్లో ఇరుక్కున్నా కూడా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలైతే ఎక్కువగా రావనే చెప్పాలి.

మరి ఇప్పుడు అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాల్లో నుంచి సాంగ్స్ రాసే ఆఫర్స్ వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.