ఒకే తేదీన అఖిల్, నాగచైతన్య సినిమాలు.. అక్కినేని వారసుల్లో హిట్ ఎవరికో?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.

ఎందుకంటే మన్మధుడు నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

అలాగే నాగార్జున తనయుడు నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించిన బంగార్రాజు సినిమా మాత్రమే వీరికి 2022 లో దక్కిన ఒక హిట్ సినిమా అని చెప్పవచ్చు.

దీంతో అక్కినేని హీరోలు అందరూ 2023 పైన ఆశలు పెట్టుకున్నారు.20023 ఏడాది అన్న వారికి కలిసొస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కినేని హీరోలు నటిస్తున్న సినిమాలను 2023 లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు.

మరొకవైపు అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం పోస్టర్లు మాత్రమే విడుదల అయ్యాయి.

"""/"/ ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు.అయితే ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

అయితే సంక్రాంతికి ఏజెంట్ సినిమా విడుదల అవుతుంది అని అక్కినేని అభిమానులు అనుకున్నప్పటికీ ఊహించని విధంగా ఆ సినిమా వాయిదా పడింది.

దాంతో ఏజెంట్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అక్కినేని హీరోలకు సంబంధించి ఒక ఆసక్తికర తెగ వైరల్ అవుతోంది.

"""/"/ అదేమిటంటే నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమా, అలాగే అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాలను జనవరి 1న విడుదల చేయాలి అని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదే విషయం గురించి తెలుసుకొని ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.చిత్ర బృందం ప్రకటించకపోయినప్పటికీ వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే మరొకవైపు జనవరి ఒకటవ తేదీన ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే కస్టడీ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ డేట్ ని కూడా జనవరి 1న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజాలు తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

భారత సంతతి సింగర్ ప్రేమ్ థిల్లాన్ ఇంటిపై కాల్పులు .. ఉలిక్కిపడిన కెనడా