విజయ్ లియో సినిమాలో ఏజెంట్ టీనా కంటిన్యూ అవుతుందా.. ఇందులో నిజమెంత?

సాధారణంగా మనం థియేటర్లలో మంచి మంచి సినిమాలు చూసినప్పుడు సినిమాలలోని మంచి మంచి సన్నివేశాలు అలాగే సీన్స్ మన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగా, ఒక్కసారి అన్ని కూడా మైండ్ లోకి వచ్చి వెళ్తూ ఉంటాయి.

ఇక అదే విషయం గురించి చాలా మంది కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని చర్చిస్తూ ఉంటారు.సినిమాలో అటువంటి క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.

అయితే విశ్వనటుడు కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్.ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి అని చెప్పవచ్చు.

అన్నింటికి మించి ఏజెంట్ టీనా ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు.< -->అంతే కాకుండా ఆ క్యారెక్టర్ పోషించిన ఆమెకు విక్రమ్ మూవీనే డెబ్యూ అంటే మీరు నమ్మగలరా? కానీ నమ్మి తీరాల్సిందే.

ఏజెంట్ టీనా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు వాసంతి.కోలీవుడ్ లో వాసంతి దాదాపుగా ముప్పై ఏళ్లుగా పనిచేస్తోంది.

కానీ 2022లో విడుదలైన విక్రమ్ సినిమానే ఆమెకు డెబ్యూ.అదెలా సాధ్యం అంటే, వృత్తిపరంగా క్లాసికల్ డాన్సర్, డాన్స్ టీచర్.

ముప్పై ఏళ్లుగా ఆమె డాన్స్ లో పాఠాలు చెబుతూ కొన్నాళ్లుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా కూడా పనిచేసింది.ఈ నేపథ్యంలోనే లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ సాంగ్ లో కూడా వాసంతి మెరిసింది.

< -->అదే సమయంలో ఆమె ఎనర్జీని గమనించిన డైరెక్టర్ లోకేష్ తాను నెక్స్ట్ తీసిన విక్రమ్ లో ఏజెంట్ టీనా క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు.ఆ విధంగా డాన్సర్ వాసంతి కాస్త నటి ఏజెంట్ టీనాగా పాపులర్ అయ్యింది.

ఇది ఇలా ఏజెంట్ టీనా లోకేష్ తెరకెక్కిస్తున్న దళపతి67 సినిమాలో కూడా కంటిన్యూ అవుతోందని తెలుస్తోంది.తాజాగా విజయ్ లోకేష్ మూవీకి లియో బ్లడీ స్వీట్ అని టైటిల్ అనౌన్స్ చేశారు.

అంతే కాకుండా ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో టీనా క్యారెక్టర్ ఉందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫోటో ప్రకారం చూస్తే వాసంతి షూటింగ్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

క్లిక్ పూర్తిగా చదవండి

కాబట్టి ఏజెంట్ టీనా ఉంది కాబట్టి ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని కన్ఫర్మ్ అయ్యింది.

నమ్మకంగా ఉంటూ ఎన్నారైని వెన్నుపోటు పొడిచిన అకౌంటెంట్.. మోసం ఎలా బయటపడిందంటే..

జీవితం చిన్నది ఆరోజు ఎప్పుడొస్తుందో తెలియదు… అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!

ఆరోజు చెప్పులు విసిరింది లక్ష్మీపార్వతి పైనే.. చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదంటూ?

నేడు హైదరాబాద్ కోకాపేటకు సీఎం కేసీఆర్..!

పనిచేసే సమయంలో ఆన్లైన్ షాపింగ్‌ అంటే ఇలాగే ఉంటుంది… జరా జాగ్రత్త అబ్బాయిలూ!

అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కీలక ప్రసంగం..