'ఆచార్య' బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేస్తుందా.. కష్టమే అట!

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.చిరు, చరణ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

అయితే ఈ అంచనాలను అటు కొరటాల శివ కానీ ఇటు మెగా హీరోలు కానీ అందుకోలేక పోయారు.

ఈ సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది.కొరటాల నుండి దాదాపు నాలుగేళ్ళ తర్వాత సినిమా వచ్చినా ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయారు.

చరణ్ ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

"""/" / అందుకే ముందు నుండి ఆచార్య సినిమాపై అందరి ద్రుష్టి పడింది.

కానీ కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏదీ కూడా అలరించలేక పోయింది.తెలుగు రాష్ట్రాల్లోనే కాది రిలీజ్ అయినా అన్ని చోట్ల ఓపెనింగ్ డే నాడే ఆచార్య అనుకున్నంత స్థాయిలో మెప్పించ లేదు.

అంతేకాదు మెగా హీరోల సినిమా అయినా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతగా జరగలేదు.

ఈ సినిమా హైదరాబాద్ లో 4.9 క్రాస్ మాత్రమే రాబట్టింది.

ఇటీవల రోజుల్లో హైదరాబాద్ లో పెద్ద సినిమాలన్నీ దాదాపు 6 నుండి 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తున్నాయి.

నైజం ఏరియాలో ఈ సినిమా ఫస్ట్ డే 7.90 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్, 30 కోట్ల షేర్ రాబట్టిందని చెబుతున్నారు.

ఈ లెక్కలు చూసి అసలు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా.ఆ మార్క్ టచ్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమాకు 133 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.మరి బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే 134 కోట్ల షేర్ సాదించాలి.

చూడాలి మరి ఈ సినిమ ఎంత రాబడుతుందో.

ప్రయాణంలో వాంతులా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!