అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: మాజీ మంత్రి బాలినేని
TeluguStop.com
వైసీపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) తెలిపారు.
తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాస్తున్నారని బాలినేని తెలిపారు.
అభివృద్ధి కోసమే మాగుంటకు( Magunta ) ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరానని చెప్పారు.
"""/" /
మిగతా నియోజకవర్గాల ఇంఛార్జులు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనున్నట్లు ఉన్నారని తెలిపారు.ఎంపీ అభ్యర్థిగా( MP Candidate ) ఎవరు వచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
తన పని తాను చేసుకుంటానన్న బాలినేని ఒంగోలు( Ongole ) ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పని చేస్తానని తెలిపారు.
ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలను పంపిణీ చేయాలన్నదే తన ఆశని తెలిపారు.
రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!