నాగార్జున అలాంటి వ్యక్తి.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..?

వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రేయ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సయామీ ఖేర్ పరిచయమయ్యారు.

రేయ్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా తరువాత సయామీ ఖేర్ కు పెద్దగా ఆఫర్లు రాలేదు.

సయామీ ఖేర్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తుండగా నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమాలో సయామీ ఖేర్ రా ఏజెంట్ రోల్ లో నటిస్తున్నారు.సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సయామీ ఖేర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సయామీ ఖేర్ మాట్లాడుతూ వైల్డ్ డాగ్ యాక్షన్ మూవీ అని.మొదట ఈ సినిమా కొరకు వైల్డ్ డాగ్ డైరెక్టర్ అహిసోర్ సాల్మన్ తనను సంప్రదించాడనితెలిపారు.

నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి మూవీ అంటే తనకు ఎంతో ఇష్టమని సయామీ ఖేర్ పేర్కొన్నారు.

నాగార్జునతో కలిసి నటించాలని ప్రతి నటి భావిస్తుందని.వైల్డ్ డాగ్ షూటింగ్ సెట్ లోనే తొలిసారి తాను నాగార్జునను కలిశానని ఆమె అన్నారు.

నాగార్జున గురించి మాట్లాడుతూ షూటింగ్ సమయంలో నాగార్జున అందరితో సరదాగా ఉంటారని.ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటారని నాగార్జునకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సయామీ ఖేర్ వెల్లడించారు.

తను స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నుంచి రావడం వల్ల సినిమాలోని కొన్ని కష్టమైన సీన్లను కూడా సులువుగా చేయడం సాధ్యమైందని సయామీ ఖేర్ పేర్కొన్నారు.

"""/"/ మనాలీలో వైల్డ్ డాగ్ షూటింగ్ జరిగిందని ఈ మూవీలో కామెడీ సీన్స్, పాటలు లేవని సయామీ పేర్కొన్నారు.

తనకు దర్శకధీరుడు రాజమౌళి అంటే ఎంతో ఇష్టమని ఛాన్స్ వస్తే ఆయన డైరెక్షన్లో నటించాలని కోరుకుంటున్నానని ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా నటించాలని ఉందని సయామీ ఖేర్ తన మనస్సులోని కోరికను బయటపెట్టారు.

ప్లాస్టిక్ వలలో చిక్కుకుని తాబేలు విలవిల.. రక్షించిన వ్యక్తి.. వీడియో వైరల్..