గోల్కొండలో నల్ల చిరుత హాల్ చల్!?
TeluguStop.com

హైదరాబాద్ గోల్కొండ పీఎస్‌పరిధిలో బుధవారం (నిన్న) సాయింత్రం నల్ల చిరుత కనిపించి కలకలం రేపింది.


కరోనా మహమ్మారిని నియంత్రించే నేపథ్యంలో గత 55 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


ఇంకా అలాంటి ఈ సమయంలో లాక్ డౌన్ కారణంగా రహదారులపై రాకపోకలు తగ్గాయి.
రహదారులపై జన సంచారం లేకపోవడంతో అటవీ జంతువులు ఎంతో ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే గోల్కొండ పీఎస్ పరిధిలోని ఫతేదర్వాజా పరిసరాల్లో నల్ల చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు.
అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను స్థానిక పోలీసులకు అందించి సమాచారం అందించారు.దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఎట్టకేలకు ఆ నల్ల చిరుతను ప్రత్యేక బోనులో అతి కష్టం మీద దాన్ని పట్టుకున్నారు.
స్థానికులు నల్ల చిరుత అని భయాందోళనకు గురయ్యారని, కానీ అది ''మాను పిల్లి'' అని అటవీశాఖ అధికారులు తెలిపారు.
దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సిగరెట్‌తో దగ్గు మాయం.. 4 ఏళ్ల పిల్లాడితో పొగ తాగించి డాక్టర్ వింత చికిత్స..