భ‌ర్త కోసం ఎద‌రుచూస్తున్న ఓ భార్య ఆవేద‌న‌.! చూస్తే కన్నీళ్లొస్తాయి.!

నా భ‌ర్త ఉపాధి కోసం ఢాకా వెళ్లాడు.ప్ర‌తి 6 నెల‌ల‌కోసారి ఇంటికొచ్చి వెళ‌తారు.

కానీ ఈ సారి వెళ్లిన 3 నెల‌ల‌కే తిరిగొచ్చారు.కార‌ణం నేను ప్రెగ్నెంట్ ! ఓ రోజు సాయంత్రం న‌న్ను మా ఇంటిప‌క్క‌నే ఉన్న న‌ది ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు.

పుట్ట‌బోయే బిడ్డ కోసం నేను చాలా పేర్లు ఆలోచించాను.కానీ అమ్మాయైతే నోబి( న‌ది) అని, అబ్బాయైతే ఛాన్ ( చంద‌మామ‌) అనే పేర్లు పెట్టుకుందామ‌ని చెప్పారు.

నేనూ స‌రే అన్నాను.ఇక ఆయ‌న తిరిగి వెళ్ళే స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తుంద‌న‌గా.

నీ కోసం నికిష్ట‌మైన ప‌చ్చ‌రంగు చీర కొన‌డానికి బ‌జారుకెళుతున్నాను.అది నీకిచ్చి నేను మ‌ళ్ళీ ఢాకా వెళ్తాను.

వ‌చ్చేలోపు పండంటి బిడ్డ‌ను నాకివ్వాల‌ని చెబుతూ.నా నుదుటి మీద ముద్దిచ్చి ఇంటినుండి బ‌య‌లుదేరారు.

! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఉద‌యం వెళ్లిన వ్య‌క్తి సాయంత్ర‌మైన ఇంటికి తిరిగిరాలేదు.ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.

ఒక రోజంతా ఎద‌రుచూశాం.అయినా ఫ‌లితం లేదు.

, పోలీస్ స్టేష‌న్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం., అక్క‌డి నుండి కూడా ఎటువంటి స‌మాచారం లేదు.

ఇప్పుడు నాకు ఏడాదిన్న‌ర వ‌య‌స్సున్న కూతురుంది.త‌ను ఇప్పుడిప్పుడే అబ్బా అని పిలుస్తుంది.

ఏవండీ ఎక్క‌డున్నారండీ.మ‌న నోబి అబ్బా అని పిలుస్తుందండీ.

ఆ పిలుపు విన‌డానికైనా ఓ సారి వ‌చ్చిపోండి.నాకే చీర‌లొద్దు.

మీరుంటే చాలు.దేవుడు నిజంగానే అంద‌రి కోరిక‌లు తీరుస్తాడా.

? అయితే మ‌రి నా మొర ఎందుకు ఆల‌కించ‌ట్లేదు? నేనేం త‌ప్పు చేశాను.

? ఇప్ప‌టికీ నేను నా భ‌ర్త తిరిగి రావాల‌నే కోరుకుంటున్నాను.అయినా దేవుడు నాప‌ట్ల ఎందుకు ద‌య చూప‌ట్లేదు.

?.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు