భర్తను హత్య చేసేందుకు భార్య సుపారీ!

భర్తను హత్య చేసేందుకు భార్య సుపారీ!

నల్గొండ జిల్లా:వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు పవిత్రమైన వివాహ బంధాన్ని అపవిత్రం చేస్తూ అమానుష ఘటనలకు తెగబడుతున్నారు.

భర్తను హత్య చేసేందుకు భార్య సుపారీ!

బావతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి మరీ చంపించిన దారుణ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

భర్తను హత్య చేసేందుకు భార్య సుపారీ!

సుపారీ గ్యాంగ్ తో పని పూర్తి చేయించి మృతదేహాన్ని నాగార్జున సాగర్ కెనాల్ లో పడేసి ఏమీ తెలియనట్లు చేతులు దులుపుకున్నారు.

కానీ,రాగ్య ఫోన్ కాల్ డేటా నిందితులను పట్టించడంతో బావ,మరదళ్ల అక్రమ బాగోతం బయటపడింది.

వివరాల్లోకి వెళితే మిర్యాలగూడ మండలం తుంగపాడు తండాకు చెందిన లావుడ్య రాగ్య (32) కి అదే జిల్లా పెద్దవూర మండలం ఊరబావి తండాకు చెందిన రోజాతో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.

వారికి ఇద్దరు పిల్లలు.ఉపాధి కోసం రాగ్య కుటుంబం హైదరాబాద్ నగరానికి వలస వెళ్లింది.

రాగ్య కారు డ్రైవర్ గా పనిచేస్తూ మణికొండ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.

ఇబ్రహీంపట్నం కు చెందిన లక్పతి వరుసకి రోజాకి బావ అవుతాడు.కొద్దికాలంగా ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.

తమ ఏకాంతానికి భర్త రాగ్య అడ్డుగా ఉన్నాడని భావించిన రోజా,ప్రియుడైన బావ లక్పతి ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

సుపారీ ఇచ్చి రాగ్యను హత్య చేయించేందుకు పూనుకున్నారు.ఈ క్రమంలో రాగ్యను హతమార్చేందుకు నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాకి చెందిన బాలాజీ,మాన్సింగ్ తో ప్రియుడు లకపతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రాగ్యని హతమారిస్తే రూ.20 లక్షలు చెల్లించేలా డీల్ కుదిరింది.

హత్య పథకంలో భాగంగా చేపల వ్యాపారం చేసే బాలాజీ,మాన్ సింగ్ లు తరచూ ఫోన్ చేస్తూ కారు డ్రైవర్ రాగ్యతో పరిచయం పెంచుకున్నారు.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అతన్ని గత నెల 19 న దారుణంగా హతమార్చారు.

హత్య చేసిన అనంతరం నేరేడుగొమ్ము మండల పరిధిలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో అతని శవాన్ని పడేశారు.

పైకి తేలకుండా ఉండేందుకు ఇనుప చువ్వలు కట్టి మరీ పడేసినట్లు తెలుస్తోంది.అయితే కొద్దిరోజులుగా రాగ్య కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.కనిపించకుండా పోయిన రోజు ముందు నుంచి రాగ్య ఫోన్ కాల్ డేటా బయటికి తీయడంతో బాలాజీ,మాన్సింగ్ దొరికిపోయారు.

వారిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు విషయం కక్కేశారు.రూ.

20 లక్షలు సుపారీ ఇస్తామన్నారని చెప్పడంతో లక్పతి,రోజా అనైతిక సంబంధం బయటపడింది.ప్రియుడి మోజులో భర్తను కట్టుకున్న భార్యే కిరాతకంగా హత్య చేయించనట్లు తేలింది.

పోలీసులు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్ వీడియో: ఇందుకు కాదు, కోతి చేష్టలు అనేది