Jenn Chia Jon Liddell : టీనేజ్‌లో సెల్ఫీ తీసుకుంది.. అందులో హస్బెండ్‌ ఉండటం చూసి షాకైన భార్య…

మలేషియాకు( Malaysia ) చెందిన ఓ మహిళ ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనిపెట్టింది.

అదేంటంటే ఆమె తన భర్తతో పరిచయం అవ్వకముందే అతడు పడేలా ఒక సెల్ఫీ( Selfie ) తీసుకుంది.

ఆ సెల్ఫీ తీసుకున్న సమయానికి భర్తకు, ఆమెకు ఎలాంటి పరిచయం లేదు ఇద్దరు అపరిచితులుగా ఉన్నారు.

ఈ సెల్ఫీ తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వారికి పరిచయం ఏర్పడింది.కానీ సెల్ఫీలో భర్త పడినట్లు మొన్నటిదాకా భార్య గ్రహించలేకపోయింది.

చివరికి తన భర్త తన పాత సెల్ఫీలో ఉన్నాడని తెలుసుకుంది.ఆ మహిళ పేరు జెన్ చియా,( Jenn Chia ) ఆమె భర్త పేరు జోన్ లిడెల్.

( Jon Liddell ) వారు 2014లో కలుసుకున్నారు, కానీ సెల్ఫీ 2012లో తీయబడింది.

సెల్ఫీలో జెన్ థియేటర్ కేఫ్‌లో ఉండగా, జోన్ ఆమె వెనుక వరుసలో ఉన్నాడు.

ఆ సమయంలో ఒకరికొకరు తెలియదు.ఈ విషయాన్ని జెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో పంచుకుంది.

తమ జీవితంలో సరైన సమయంలో కలిశామని చెప్పింది.దాని ముందు ఏడాది పాటు ఒంటరిగా ఉన్నానని, తర్వాత మారిపోయానని చెప్పింది.

"""/" / ఈ జంట 2014లో ఎలా కలుసుకున్నారో, 2023లో ఎలా పెళ్లి( Marriage ) చేసుకున్నారో కూడా వీడియో చూపించింది.

వీడియోలో "మేం ఒకే చోట ఉన్నాం, కానీ ఆ విషయం తన ఇద్దరికీ" అని టెక్స్ట్ రాసి ఉంది.

ఇంటర్నెట్‌లో చాలా మంది ఈ కథనాన్ని చూసి ఆశ్చర్యపోయారు.వారు జెన్‌ని చాలా ప్రశ్నలు అడిగారు.

ఆమె, జోన్ గురించి మంచి విషయాలు చెప్పారు.విధి వారిని ఒకచోటుకు చేర్చిందని కొందరు అన్నారు.

"""/" / "ఇన్‌విజిబుల్‌ స్ట్రింగ్‌ థియరీ"కి ఇదొక ఉదాహరణ అని కొందరు అన్నారు.

కలిసి ఉండాల్సిన ఇద్దరు వ్యక్తులు అదృశ్య దారంతో ముడిపడి ఉంటారని ఇది ఒక నమ్మకం.

ఈ వీడియోపై జోన్ కూడా వ్యాఖ్యానించాడు.2012లో కలవకపోవడం ఆనందంగా ఉందని.

అప్పుడు కలిసి ఉంటే ఉంటాము ఒకరినొకరు ఇష్టపడి ఉండే వాళ్ళం కాదేమో అని పేర్కొన్నాడు.

సరైన సమయంలో కలిశామని చెప్పాడు.

GPS లేని రోజుల్లోనే 3D మ్యాప్.. పురాతన ఆవిష్కరణతో సైంటిస్టులే విస్తుపోయారు!