బతికుండగానే భర్తను చంపేస్తున్న భార్య... దాంతో నెలకోసారి ఊరిలో శవం లేస్తోంది?
TeluguStop.com

ఎలాంటి అడదయినా ముత్తైదువగానే ఉండటానికి ఇష్టపడుతుంది.మరి ఆమెకు ఏమయ్యిందో తెలియదు, భర్త ఎలాంటి టార్చర్ చేస్తున్నాడో అంతకంటే తెలియదు.


ఆమె మాత్రం తన మెడలోని మంగళసూత్రం తీసేసి, కాలి మెట్టెలు తొలగించి, ఆఖరకు నుదుట బొట్టును చెరిపేసింది.


ఇలా ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు నెలల తరబడి తనకు తాను ఓ విధవురాలిలా బతుకుతోంది.
కానీ ఆమె భర్త బతికే వున్నాడు.అలాగని ఆమె ఇంటి నుంచి ఎక్కడికీ వెళ్లిపోలేదు.
భర్త, బిడ్డలతో కలిసే ఉంటోంది.ఇక ఈ ప్రవర్తనే ఆ ఊరి జనానికి పలు అనుమానాలకు దారితీసింది.
ఆమె అలా ఉన్నందువల్లనే ఊరికి అరిష్టం పట్టుకుందని జనంలో భయం మొదలయ్యింది.వివరాల్లోకెళితే, అనంతపురం జిల్లా, గుత్తి మండల పరిధిలోని పి.
ఎర్రగుడి అనే ఊరొకటుంది.ఆ ఊరిలో ప్రతి 3 నెలలకు ఓ మారు ఎవరో ఒకరు అకారణంగా మరణిస్తున్నారట.
అది కూడా 23వ తేదీనే చనిపోతున్నారట.ఇదే ఊరిలో సదరు మహిళ తన భర్తతో కొన్ని సంవత్సరాలుగా గొడవ పడుతోంది.
భర్త మీద కోపంతో అతను బతికుండగానే బొట్టు, గాజులు, తాళి తీసేసింది.ఈ కారణంగానే ఊరిలో అరిష్టం, అకాల మరణాలు సంభవిస్తున్నాయని ఆ ఊరి జనం నమ్ముతున్నారు.
ఊరి పెద్దలు చెప్పినా ఆమె వినిపించుకోలేదు.దీంతో ఊరి జనం పోలీసులను కలిశారు.
తమ ఊరిని కాపాడాలని ప్రాధేయపడ్డారు.సుమారు 500 కుటుంబాలు ఉండే ఆ ఊరిలో గడిచిన తొమ్మిది నెలల్లో అలా 8 మంది మరణించారట.
ఈ మరణాలకు కారణమేమిటో అని వారు ఓ పూజారిని అడగగా ఆ మహానుభావుడు ఓ అనుమానాన్ని వ్యక్తపరిచాడట.
దాంతో వారు ఆమెను నిందిస్తూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని ప్రశ్నించగా భర్తపై కోపంతో తానిలా చేశానని చెప్పింది.
దానికి వారు ఊరి జనం మాట వినాలని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.దీంతో వైధవ్యాన్ని వీడేందుకు ఆమె అంగీకరించింది.
దాంతో కధ సుఖాంతం అయ్యింది.
బహిరంగంగా కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్