ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య.. హతుడు తల్లికి అనుమానం రావడంతో..!

ఇటీవలే శారీరక సుఖం కోసం ఏర్పడే అక్రమ సంబంధాలు( Illegal Relationship ) చివరికి తీవ్ర విషాదంతో ముగుస్తున్నాయి.

చాలామంది వివాహ బంధం కంటే అక్రమ సంబంధానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కుటుంబాన్ని నాశనం చేసి రోడ్డున పాడేస్తున్నారు.

ఇక మిగిలిన జీవితం మొత్తం జైలు పాలు చేసుకుంటున్నారు.ఇలాంటి కోవలోనే ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి జైలు పాలయ్యింది.

చివరికి కన్న కూతురిని అనాధను చేసేసింది.ఈ ఘటన కర్ణాటకలోని( Karnataka ) దావణగేరే.

బిసిలేరి గ్రామంలో చోటుచేసుకుంది.అసలు హత్యకు గల కారణాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.

వివరాల్లోకెళితే.బిసిలేరి గ్రామంలో నింగరాజు, కావ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి ఒక కూతురు సంతానం.సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో బీరేష్ ( Biresh ) అనే యువకుడు అడుగుపెట్టాడు.

కావ్య, బీరేష్ ల పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ ఎంజాయ్ చేసేవారు.

"""/" / అంతేకాదు గత నెలలో వీరిద్దరూ పారిపోతే గ్రామస్తులు పట్టుకొని తిరిగి ఊరికి తెచ్చారు.

తరువాత గ్రామ పెద్దల ముందు పంచాయతీ జరిగింది.నింగరాజు( Ningaraju ) విడాకులు ఇస్తానని, కావ్యను వదిలేస్తానని చెప్పాడు.

ఊరి పెద్దలు నింగరాజును సముదాయించారు.ఇక బీరేష్, కావ్యలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

బీరేష్ ఇప్పటినుంచి కావ్య జోలికి వెళ్ళనని గ్రామస్తుల ముందు మాట ఇచ్చాడు.కావ్య కూడా ఎటువంటి తప్పుడు పనులు చేయనని మాట ఇచ్చింది.

దీంతో నింగరాజు తిరిగి కావ్యను స్వీకరించాడు. """/" / కానీ రహస్యంగా మళ్ళీ కావ్య, బీరేష్ కలవడం ప్రారంభమైంది.

ఈ విషయం నింగరాజుకు తెలిసి కావ్యతో గొడవపడ్డాడు.భర్త అడ్డు తొలగించుకోవాలని బీరేష్ తో కలిసి కావ్య మాస్టర్ ప్లాన్ రచించింది.

ప్లాన్ లో భాగంగా బీరేష్, కావ్య ఇంటికి వచ్చాడు.కానీ హత్య చేసేంత ధైర్యం బీరేష్ లో లేదు.

ఇక కావ్య కాస్త ధైర్యం చేసి భర్తను బండరాయితో బలంగా కొట్టింది.వెంటనే రక్తపు మడుగులోకి జారి నింగరాజు ప్రాణాలు వదిలాడు.

ఈ హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా కావ్య ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది.

కానీ నింగరాజు తల్లి కు కాస్త అనుమానం రావడంతో కావ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తమదైన శైలిలో కావ్యను విచారించగా నేరాన్ని అంగీకరించింది.ప్రస్తుతం కావ్య, బీరేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్7, సోమవారం 2024