అమెరికా తీసుకెళ్లి వేధింపులు.. ఎన్ఆర్ఐ భర్త నుంచి తప్పించుకున్న భార్య

రోజుకొక ఎన్ఆర్ఐ(NRI) అల్లుళ్ల బాగోతం పత్రికల్లో, టీవీలలో వెలుగులోకి వస్తున్నా ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు ఇంకా ఇంకా మోసపోతూనే ఉన్నారు.

గొప్పలకుపోయి అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు మానసిక వ్యధను అనుభవిస్తున్నారు.తాజాగా తెలంగాణలో(Telangana) ఓ ఎన్ఆర్ఐ బాగోతం వెలుగులోకి వచ్చింది.

వరకట్న వేధింపుల కేసులో అమెరికాలో స్థిరపడిన ఓ ప్రవాస భారతీయుడు, అతని కుటుంబ సభ్యులపై భద్రాచలం (Bhadrachalam)పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

భద్రాచలం శాంతినగర్(Bhadrachalam Shantinagar) కాలనీకి చెందిన పాకలపాటి పూజిత (Pakalapati Poojita)అనే వివాహిత తన భర్త తాళ్లూరి ప్రవీణ్ రాజా, అత్తమామలు ప్రభాకర్, మణిమాల(Talluri Praveen Raja, In-laws Prabhakar And Manimala), వారి పెద్ద కుమారుడు ప్రీతంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.

పూజిత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో .తాను జూలై 27, 2021న ప్రవీణ్ రాజాను వివాహం చేసుకున్నానని చెప్పింది.

వివాహం జరిగిన క్షణం నుంచి తనను భర్త , అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించింది.

వివాహం జరిగిన నాటి నుంచి 6 నెలల పాటు ఇవన్నీ కొనసాగాయని తెలిపింది.

"""/" / ఆ తర్వాత తాను భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయానని.అక్కడ తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశానని, ప్రవీణ్ యథాప్రకారం అమెరికాలోనూ తనను హింసించాడని పూజిత వెల్లడించింది.

తాను సంపాదించిన మొత్తాన్ని భర్త తన సోదరుడు ప్రీతమ్ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసేవాడని పేర్కొంది.

అమెరికా వచ్చిన ప్రతిసారి తన అత్తమామలు తనను హింసించేవారని పూజిత తెలిపింది.అతని వేధింపులు భరించలేక కట్నం తీసుకొచ్చే వంకతో తన బాబుని తీసుకుని భారత్‌కు వచ్చానని అత్తమామలు హింసించడంతో తన పుట్టింటికి వెళ్లిపోయినట్లు పూజిత వెల్లడించింది.

తన భర్త నుంచి తనకు, తన బిడ్డకు, తన తల్లిదండ్రులకు ముప్పు ఉందని ఆమె ఫిర్యాదు చేసింది.

నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదేం వింత శవపేటిక.. స్నికర్స్‌తో బ్రిటిష్ వ్యక్తి అంత్యక్రియలు.. వైరల్ ఫొటో వెనుక అసలు కథ?