భర్త, పిల్లలను చంపి భార్య ఆత్మహత్య..!

ప్రస్తుతం సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది.క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అయితే భర్త, ఇద్దరు పిల్లలకు ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఇచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పరిధిలోని ధీరజ్, సుష్మారాణె దంపతులు నివాసం ఉంటున్నారు.వారికీ ఇద్దరు పిల్లలు.

అయితే ధీరజ్ ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.ధీరజ్ భార్య సుష్మా స్థానికంగా ఓ ఆస్పత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తుంది.

అయితే మంగళవారం కూతురితో బయటికి వెళ్లిన వచ్చేట్టపుడు మత్తు ఇంజెక్షన్లు తీసుకువచ్చింది.ఆమె ఆ ఇంజెక్షన్లు భర్తకు, పిల్లలకు అధిక మొత్తంలో ఇచ్చింది.

అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.అయితే బుధవారం ఎంత సమయం గడిచిన వారు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.వాళ్ళు లోపలికి వెళ్ళగానే నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ సంబంధించిన వివరాలను స్థానికులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

వైరల్: గజదొంగలు సైతం ఆ తాళాన్ని తీయలేరు… తాళం ఎలా వేశారో చూడండి!