డబ్బు కోసం కట్టుకున్న భర్తనే కిడ్నాప్.. దక్షిణాఫ్రికాలో భారత సంతతి మహిళ ఘాతుకం
TeluguStop.com
జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ.భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యే మొగుడిని చిత్ర హింసలకు గురిచేస్తూ ఏకంగా కిడ్నాప్‌కు గురిచేస్తే.
తాజాగా దక్షిణాఫ్రికాలో (South Africa)స్థిరపడిన ఓ భారత సంతతి(Indian-origin) కుటుంబంలో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
గత ఆదివారం ప్రిటోరియాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అష్రఫ్ ఖాదర్ అపహరణకు గురవ్వగా.
24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఆయనను రక్షించారు.అయితే కేసు దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి.
ఈ కిడ్నాప్ వెనుక అష్రఫ్ భార్య 47 (Ashraf's Wife 47)ఏళ్ల ఫాతిమా ఇస్మాయిల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
యాంటీ కిడ్నాపింగ్ ( Kidnapping)యూనిట్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌లతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం అనుమానితులను మామెలోడి శివారులోని ఓ ఇంట్లో గురించింది.
వారితో పాటు ఫాతిమా మంతనాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తేల్చారు.ఫాతిమ సహా మొత్తం నలుగురు నిందితులపై కిడ్నాప్, డబ్బు డిమాండ్, వాహనాన్ని హైజాక్ చేయడం తదితర అభియోగాలు మోపారు.
అయితే అష్రఫ్‌ను విడుదల చేయడానికి వారు ఎంత మొత్తం డిమాండ్ చేశారన్నది మాత్రం తెలియరాలేదు.
"""/" /
నిందితులను అరెస్ట్ చేసిన ఇంట్లో తుపాకులు, మొబైల్ ఫోన్స్, ఓ వాహనాన్ని(Guns, Mobile Phones, A Vehicle) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే బాధిత కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఐదవ అనుమానితుడుగా భావిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇతను అష్రఫ్ ఖాతా నుంచి నిధులను పొందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.అనుమానితులకు బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది.
"""/" /
కాగా.దక్షిణాఫ్రికాలో గత రెండేళ్లుగా భారతీయ వ్యాపారవేత్తలు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు పెరుగుతున్నాయి.
ఈ పరిణామాలపై భారతీయ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.కొన్ని సందర్భాల్లో పిల్లలను కూడా దుండగులు టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఫలితంగా భారతీయ వ్యాపారులు, సంపన్నులు తమ రోజువారీ కార్యకలాపాల కోసం భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు.
శంకర్ ఇక రిటైర్మెంట్ అవ్వడం బెటరా..?