చెట్టుకు పుట్టినరోజు వేడుకలు.. మ్యాటరేంటంటే.?

ప్రస్తుత రోజుల్లో వివాహం అనే బంధం చాలా బలహీన పడిందని చెప్పవచ్చు.పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపల చాలామంది జంటలు వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్న వారు ఎక్కువైపోతున్నారు.

బిజీబిజీ పరుగుల జీవితంలో ఎవరి దారి వారు చూసుకోవడంతో ఇలాంటి సంఘటనలు ఎక్కువ అయిపోయాయి.

అయితే ఇది వరకు పరిస్థితులు అలా కాదు.ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఎవరో ఒకరు మరొకరి దారిలో ప్రయాణిస్తూ జీవనం సంతోషంగా సాగించేవారు.

ఇకపోతే భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో అని చెప్పడానికి చాలా సంఘటనలే నిర్దర్శనంగా ఉన్నాయి.

అనోన్య దాంపత్యం ఉన్న దంపతులు మృత్యువును కూడా విడతీయలేరు అంటూ తాజాగా ఓ సంఘటన నిరూపిస్తోంది.

ఓ మహిళ తన చనిపోయిన భర్త జ్ఞాపకాలను ఓ చెట్టులో( Tree ) చూసుకుంటూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / వికారాబాద్ జిల్లా( Vikarabad District ) తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి( Vijayalaxmi ) తాండూర్ వ్యవసాయక పరిశోధన కేంద్రంలో ఓ వృక్షానికి చనిపోయిన ఆమె భర్త దుస్తులు వేసి కొమ్మలకు బెలూన్లు కట్టి అందంగా చెట్టును అలంకరించి వినూత్నంగా జన్మదిన రోజును( Birthday ) జరుపుకుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.8 ఏళ్ల క్రితం విజయలక్ష్మి తన భర్త వెంకటయ్య( Venkataiah ) అనారోగ్యం పాలవడంతో ఆ సమయంలో తాను చనిపోతాడని గ్రహించిన ఆమె వారి ఇంటి ఎదుట మొక్క నాటారు.

అలా మొక్క నాటిన కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించాడు.అప్పుడు నాటిన మొక్క ఇప్పుడు చెట్టుగా మారింది.

దీంతో ప్రతి సంవత్సరం ఆ చెట్టుకు డెకరేషన్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

"""/" / కాకపోతే కొద్ది రోజుల క్రితం నేషనల్ హైవే వేయడంలో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందు ఉన్న ఆ చెట్టు తొలగించాలని అధికారుల ప్రయత్నం చేయగా.

ఆ చెట్టు కథను వారికి తెలియజేసి చెట్టు చనిపోకుండా ఉండడానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో అధికారులు ఆ చెట్టును జెసిబి సహాయంతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోకి తీసుకువెళ్లి అక్కడ ఆ చెట్టును నాటారు.

ఇక అప్పటినుంచి ఆ ప్రదేశంలో ఆ చెట్టుకు పంచబక్ష పరమాన్నాలు పెట్టి, పూజలు చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియాలో మరోసారి సంచలనం సృష్టించబోతున్న నిఖిల్….