ఈమద్య కాలంలో అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా?

ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ఇంగ్లాండ్‌లో జరుగుతుంది.క్రికెట్‌ అంటే కొద్ది పాటి ఇష్టం ఉన్న వారు కూడా ప్రపంచకప్‌ మ్యాచ్‌లు అనగానే టీవీలో తల పెట్టేస్తున్నారు.

ప్రపంచ కప్‌ పోటీల్లో మన ఇండియా అద్బుతమైన ఫామ్‌తో ముందుకు దూసుకు వెళ్లడం సంతోషకర విషయం.

ఇలాంటి సమయంలో టీం ఇండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడటం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో కాకుండా అంతకు ముందు జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కూడా అంపైర్లు చేతికి ఒక చిన్న బ్యాటు తరహా పరికరంను పెట్టుకుని ఉంటున్నారు.

దీనిని ఆర్మ్ గార్డ్ అంటారు.ఆ బ్యాటు తరహా పరికరంలో కెమెరా ఉంటుందని కొందరు, స్పీకర్‌ ఉంటుందని మరి కొందరు రకరకాలుగా భావిస్తున్నారు.

అయితే ఆ పరికరంలో అవేవి ఉండవు.ఆ పరికర ఉద్దేశ్యం అంపైర్‌ రక్షణ.

అవును అంపైర్‌కు అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడుతుందన్న మాట.అంపైర్‌కు అత్యవసర పరిస్థితులు ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు కదా.

అప్పుడప్పుడు బ్యాట్స్‌ మన్‌ కొట్టిన బాల్స్‌ అంపైర్స్‌ మీదుకు వస్తూ ఉంటాయి.వాటిని ఎదుర్కొనేందుకు అంపైర్స్‌ దీన్ని అడ్డుగా పెడతారన్నమాట.

"""/"/ కొన్ని సంవత్సరాల క్రితం ఒక క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైరింగ్‌ నిర్వహిస్తున్న అంపైర్‌ బంతి బలంగా తాకడంతో చనిపోయిన విషయం తెల్సిందే.

అంపైర్లు ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా కొన్ని సార్లు వీలు పడదు.అందుకే ప్రముఖ అంపైర్‌ అయిన బ్రూస్‌ ఆక్సెన్‌ ఫోర్డ్‌ ఈ పరికరంను కనిపెట్టాడు.

బ్యాట్స్‌మన్‌ ఉపయోగించే సేఫ్టీ పకికరాలను అంపైర్‌ ఉపయోగించలేడు.అందుకే ఈ పరికరంను ఉపయోగించడం వల్ల ప్రమాదాలను తప్పించుకోవచ్చని ఆయన ఐసీసీని ఒప్పించాడు.

అంపైర్‌ల సేఫ్టీ కోసం ఐసీసీ ఈ పరికరం వాడేందుకు అంగీకరించింది. """/"/ 2015 నుండి ఈ పరికరంను అంపైర్లు వాడటం జరుగుతుంది.

దీన్ని వాడటం వాడక పోవడం అనేది అంపైర్ల ఇష్టం.వారి ఇష్టానుసారంగా వాడవచ్చు, వాడకుండా ఉండవచ్చు.

ఖచ్చితంగా ఒక కిలో బరువు ఉండే ఈ పరికరం వల్ల ఇప్పటికే కొందరు అంపైర్లు తమ మీదకు వచ్చిన బంతి వల్ల గాయం కాకుండా జాగ్రత్త పడ్డారు.

కేటీఆర్ ను అందుకే ఆరెస్ట్ చేయలేదా ?