వినాయక చవితి రోజున చంద్రుని చూస్తే ఇన్ని సమస్యలు ఎదురవుతాయా..?

ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు చాలా మంది ప్రజలు ఏ శుభకార్యాలు మొదలుపెట్టిన వినాయకుడికిపూజలు చేస్తూ ఉంటారు.

ఆయన అనుగ్రహం తో అనుకున్నా పనులు ఆటంకాలు లేకుండా మొదలవుతాయి.అలాగే గణపతి పుట్టిన రోజు శుద్ధ చవితి రోజున వినాయక చవితి( Vinayaka Chavithi ) వేడుకలను ప్రజలందరూ జరుపుకుంటారు.

అయితే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే చాలా రకాల సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒక రోజు భర్త రాక కోసం ఎదురుచూస్తున్న పార్వతీదేవి( Parvati Devi ) స్నానానికి వెళ్లబోతూ నలుగు పిండితో ప్రతిమను తయారుచేసి ప్రాణ ప్రతిష్ట చేసింది.

ఆ బాలుడిని వాకిట్లో కాపలా ఉంచి స్నానానికి వెళుతుంది.అంతలో అక్కడికి వచ్చిన శివుడిని( Shivudu ) బాలుడు అడ్డుకోవడంతో బాలుడి శిరస్సును శివుడు ఖండిస్తాడు.

ఈ ఘోరం చూసిన పార్వతీదేవి కన్నీరు పెట్టుకోవడంతో ఏనుగు శిరస్సు ను ఆ బాలుడికి అతికించి గజనానుడు( Gajananudu ) అని పేరు కూడా పెడతారు.

ఆ రోజు భక్తులు తనకు సమర్పించిన ఉండ్రాళ్లు, పిండి వంటకాలు కడుపునిండా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి వెళతాడు.

"""/" / శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణపతి అవస్థలు చూసి నవ్వుతాడు.

వెంటనే వినాయకుడి ఉదరం పగిలి అందులోనీ ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వస్తాయి.అప్పుడు ఆగ్రహించిన పార్వతి దేవి నీవల్లే నా కుమారుడికి అలా జరిగింది కాబట్టి నిన్ను చూసినవారు నీలాపనిందలు పొందుతారని చంద్రున్ని( Moon ) శపిస్తుంది.

పార్వతి దేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు.

అగ్నిదేవునికి ఋషుల భార్యల మీద మొహం కలుగుతుంది.అది గ్రహించిన అగ్ని దేవుని భార్య స్వాహా దేవి ఋషుల భార్యల రూపంలో అగ్ని దేవుని వద్దకు చేరుతుంది.

"""/" / అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలే అనుకున్న ఋషులు వారిని త్యాజించారు.

శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్ల ఋషుల పత్నులు నీలాపనిందలు గురయ్యారని దేవతలు గ్రహించారు.

వెంటనే వారు పార్వతి దేవిని కలిసి శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు.అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడో ఆరోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరిస్తుంది.

భారతీయుడు2 మూవీ ట్రైలర్ లో ఇది గమనించారా.. ఆ ముగ్గురికీ ఈ సినిమా చివరి సినిమానా?