ఫ్లైట్ టేకాఫ్..ల్యాండ్ అవుతున్నప్పుడు 'టాయిలెట్స్' వాడనివ్వరు..! ఎందుకో తెలుసా.? కారణం ఇదే.!
TeluguStop.com
ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు విమాన ప్రయాణం అందరికీ అందుబాటులోకి వచ్చింది.చాలా మంది నేటి తరుణంలో విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.అయితే ఇదంతా బాగానే ఉంది.
కానీ విమానాల్లో ప్రయాణించే వారు మాత్రం ఒక ముఖ్యమైన సూచనను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
అదేమిటంటే.విమానాల్లో ఉండే టాయిలెట్స్ గురించి.
అవును, అవే.వాటి గురించిన ఓ ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు టాయిలెట్లను ఉపయోగించడానికి అనుమతినివ్వరు.
అవును, మీరు విన్నది నిజమే.విమానం ఎయిర్‌పోర్టులో ఆగిఉన్నప్పుడో లేదంటే విమానం గాల్లో ఉన్నప్పుడో మాత్రమే టాయిలెట్లను వాడాలి.
కానీ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు టాయిలెట్లను వాడరాదు.మరి ఈ నిబంధనను ఎందుకు పెట్టారో తెలుసా.
? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఏమీ లేదండీ… విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాటిల్లో ఉండే ప్రయాణికులు సీట్లలో ఉండి సీట్ బెల్ట్స్ పెట్టుకుంటారు కదా.
దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలు అయ్యేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మరలాంటి సమయంలో టాయిలెట్‌లో ఉండడం సేఫ్ కాదు కదా.టాయిలెట్‌లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే అప్పుడు అందులో ఉండే వస్తువులకు మనం ఢీకొంటాం.
దీంతో తీవ్ర గాయాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.కనుకనే ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు టాయిలెట్లను వాడరు.
కాబట్టి అలా ఎందుకు చేస్తారో తెలిసిందిగా.కనుక మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయం … మహిళలకు పండుగే