అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ ఎందుకు స్పందించడం లేదు: పవన్
TeluguStop.com
అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.వైసీపీ నేతల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందన్నారు.
రాష్ట్రంలో మహిళల అదృశ్యం కేసులు ఎక్కువ అయ్యాయన్న పవన్ వాలంటీర్ల వద్ద ఇంటి గుట్టు మొత్తం ఉంటుందని పేర్కొన్నారు.
వ్యక్తిగత డేటా బహిర్గతం అవుతుందన్నారు.ఆడబిడ్డ రహస్యాలు బహిర్గతం చేసి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు.
కుటుంబాల వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఎందుకని ప్రశ్నించారు.రూ.
5 వేల జీతం ఇచ్చి వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటోందని ఆరోపించారు.
పరారీలో సినీ నటి కస్తూరి శంకర్… గాలిస్తున్న పోలీసులు?