దసరా పండుగ రోజు జమ్మి చెట్టును పూజించడానికి కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వృక్షాలను దైవ సమానంగా భావించి పూజిస్తారు.ఇలా పూజించే వృక్షాలలో జమ్మి వృక్షం ఒకటి.

జమ్మి చెట్టుని శమీవృక్షం, అపరాజిత వృక్షం అని కూడా పిలుస్తారు.ఇలా జమ్మి చెట్టుకు ఎంతో ప్రత్యేక పూజలను చేయడం చూస్తున్నాము.

ముఖ్యంగా జమ్మిచెట్టుకు దసరా పండుగ రోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.అసలు ఈ జమ్మిచెట్టును దసరా పండుగ రోజు పూజించడానికి కారణం ఏమిటి? జమ్మి చెట్టును పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దసరా పండుగ రోజు జమ్మి చెట్టును పూజించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం వెళ్లే సమయంలో వారి ఆయుధాలు వస్త్రాలను దాచి ఉంచి వెళ్లారని, అజ్ఞాతవాసం పూర్తి కాగానే జమ్మి చెట్టులో దాగి ఉన్న ఆయుధాలను తీసుకొని జమ్మిచెట్టును పూజించి కౌరవులపై యుద్ధానికి వెళ్ళి ఎంతో దిగ్విజయంగా తిరిగి వచ్చారని చెబుతున్నాయి.

అలాగే రామాయణంలో శ్రీరాముడు రావణుడు పై యుద్ధం చేసి విజయదశమి రోజే విజయం పొందాడని చెబుతారు.అందుకోసమే దసరా పండుగ రోజుజమ్మి చెట్టును దర్శించుకోవడం వల్ల మనం చేసే పనులలో విజయం సాధిస్తారని భావిస్తారు.

< -->దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మిచెట్టు వద్ద అపరాజిత దేవికి పూజలు నిర్వహిస్తారు.పూజ అనంతరం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్నిచదువుతూ జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయడం వల్ల మన పై ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

అలాగే జమ్మిచెట్టు దర్శనం అనంతరం జమ్మి ఆకులను తీసుకెళ్లి మన ఇంట్లో పెద్దవారికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు

ఆదిపురుష్ టీజర్ లోని షాట్స్ ను అక్కడినుంచి కాపీ చేశారా.. ఏమైందంటే?

దేశంలో ఈరోజు నుండే 5G సేవలు అమల్లోకి రానున్నాయని ఎంతమందికి తెలుసు?

ఎవరితో పోల్చినా నేను నిలబడగలను.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

మునుగోడు ఉప ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్

భాంగ్రా స్టెప్స్ వేస్తూ ఆశ్చర్యపరిచిన బర్రె.. ఫన్నీ వీడియో వైరల్‌..

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

సందీప ధర్ మస్తీ ఫొటోస్