ఆడవారు వారానికి ఒక్కసారైనా మెంతికూర తినాలట.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకుకూరల్లో మెంతికూర( Fenugreek ) ఒకటి.చాలా మంది పప్పుతో కలిపి మెంతి కూరను వండుతుంటారు.

మరికొందరు మెంతికూరతో పచ్చడి చేసుకుంటారు.పప్పే అయినా.

పచ్చడి చేసుకున్నా రుచితో పాటు మెంతికూర ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.ముఖ్యంగా ఆడవారు వారానికి ఒకసారైనా మెంతి కూరను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెంతికూర లో ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి ఖ‌నిజాల‌తో పాటు విట‌మ‌న్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌, ఫైబ‌ర్ తో స‌హా అనేక పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

ఇటీవల రోజుల్లో ఎంతో మంది ఆడ‌వారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారు.అలాంటి వారు తమ డైట్ లో మెంతికూర ను చేర్చుకోవడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది.

"""/" / అలాగే డెలివరీ తర్వాత మెంతికూర తీసుకోవడం వల్ల మహిళల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.

ప్రసవం నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా మెంతికూర తోడ్పడుతుంది.మెంతికూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల మహిళలు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మెంతి కూర తింటే రక్తహీనత( Anemia ) బారిన పడకుండా ఉంటారు.

ఎముకలు బలోపేతం అవుతాయి.తరచూ వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.

నీరసం, అలసట వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. """/" / మెంతికూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప‌లు ర‌కాల‌ విటమిన్లు ఉంటాయి.

ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.మారుతున్న వాతావరణంలో మీరు అనారోగ్యానికి గురయ్యే అవ‌కాశాన్ని త‌గ్గిస్తాయి.

శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా మెంతికూర ఎంతో మేలు చేస్తుంది.శ్వాసనాళాలను క్లియర్ చేయడానికి, శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి మెంతికూర మ‌ద్ద‌తు ఇస్తుంది.

అంతేకాదు మెంతికూర ఆరోగ్యమైన బరువును ప్రోత్సహిస్తుంది.మధుమేహం, గుండె జబ్బులు వ‌చ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా సైతం మెంతికూర రక్షిస్తుంది.