శని దేవుడికి నూనె సమర్పించడం వెనుక కారణమిదే!

శని దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం నూనె సమర్పించాలని చాలామంది చెబుతుంటారు.

ఇలా చేసిన వారికి శని అనుగ్రహం లభిస్తుందంటారు.అయితే మనం శని దేవుడికి నూనె ఎందుకు సమర్పించాలనే దాని గురించి మన గ్రంథాలలో చాలా కథలు కనిపిస్తాయి.

వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రామాయణ కాలం హనుమంతుని కథ.శాస్త్రాల ప్రకారం రామాయణ కాలంలో శని తన బలాన్ని, పరాక్రమాన్ని చూసి గర్వపడ్డాడు.

ఆ సమయంలో హనుమంతుని బలం, పరాక్రమం, కీర్తి నాలుగు దిశలలో వ్యాపించింది.హనుమంతుని గురించి శనికి తెలియగానే, శని.

హనుమంతునితో పోరాడేందుకు బయలుదేరాడు.అప్పుడు హనుమంతుడు తన ప్రభువు శ్రీరాముని భక్తిలో నిమగ్నమై నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చున్నాడు, శని దేవుడు అక్కడికి వచ్చి హనుమంతుడిని యుద్ధానికి సవాలు చేశాడు.

యుద్ధ పిలుపు విన్న హనుమంతుడు శని దేవుడిని శాంతంగా ఉండమన్నాడు.అయినా శని వినలేదు సరిగదా యుద్ధానికి కవ్వించడం ప్రారంభించాడు.

చివరికి హనుమంతుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు.ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది.

హనుమంతుడు శనిని ఘోరంగా ఓడించాడు.యుద్ధంలో హనుమంతుడు కొట్టిన దెబ్బల వల్ల శని దేవుడి శరీరమంతా నొప్పుల పాటయ్యింది.

ఈ నొప్పిని తొలగించడానికి, హనుమంతుడు శనికి నూనె ఇచ్చాడు.ఈ నూనె రాసుకోగానే శని దేవుడి బాధ అంతా తొలగిపోయింది.

అప్పటి నుండి శని దేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది.ఎవరైతే శని దేవుడికి తైలాన్ని సమర్పిస్తారో.

వారి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి, డబ్బు కొరత తీరుతుందని చెబుతారు.శని దేవునితో యుద్ధానికి దిగినప్పుడు, హనుమంతుడు తన తోకలో అతనిని చుట్టడం ప్రారంభించాడు.

శని ఆ బంధం నుండి బయటపడలేకపోయాడు.తనను బానిసత్వం నుండి విడిపించమని హనుమంతుడిని ప్రార్థించాడు.

ఇక ఎప్పుడు తాను ఇలాంటి తప్పు చేయను అని వేడుకున్నాడు.అప్పుడు హనుమంతుడు ఇచ్చిన నూనెను గాయాలపై పూసుకోవడంతో శని దేవుడి నొప్పి నిర్మూలనమయ్యిందని చెబుతారు.

సమంతకే బాధలంటున్న అభిమానులు.. రాబోయే రోజుల్లో ఆమె కష్టాలు తీరాలంటూ?