Varsha Bollamma : తొమ్మిదేళ్లుగా ప్రయత్నిస్తున్న వర్ష బొల్లమ్మ కు ఆ ఒకటి దక్కడం లేదు

వర్ష బొల్లమ్మ( Varsha Bollamma ).తెలుగు, తమిళ మరియు మలయాళ సినిమాల్లో దాదాపు తొమ్మిదేళ్లుగా 21 చిత్రాలలో నటించింది.

ఇక తాజాగా ఊరు పేరు భైరవకోన అనే చిత్రంతో తెలుగులో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఫలితం తెలియాలంటే మరో మరికొన్ని గంటల సమయం పడుతుంది.

అయితే వర్షా తెలుగులో నటించడం ఇదే మీ మొదటిది కాదు.ఇప్పటికే చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాగా జాను లో సహాయక పాత్రలో బాగానే నటించింది.

ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిత్రంతో మొదటిసారి లీడ్ గా నటించగా ఈ సినిమా పర్వాలేదనిపించింది.

"""/"/ పుష్పక విమానం( Pushpaka Vimanam )లో సైతం మరోసారి ఆనంద్ దేవరకొండ తో జతకట్టింది.

ఇంతకన్నా ముందు మిడిల్ క్లాస్ మెలోడీస్ లో కూడా ఈ జంట నే నటించడం విశేషం.

హీరో రాజ్ తరుణ్ తో స్టాండప్ రాహుల్ అనే ఒక చిత్రం అలాగే బెల్లంకొండ గణేష్ తో స్వాతిముత్యం( Swathi Muthyam ) అనే సినిమాలో కూడా నటించింది.

ఇన్ని చిత్రాల్లో తెలుగులో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్న ఇప్పటి వరకు వర్ష కు సరైన విజయం దక్కకపోవడం విశేషం.

ఇక మొట్టమొదటిగా తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటిస్తోంది.

మలయాళంలో కేవలం రెండు సినిమాల్లోనే నటించింది.కన్నడ లో కూడా మానే నెంబర్ 13 అనే సినిమాలో నటించగా అదే ఆమెకు మొదటి చిత్రం.

ఇక ఇన్ని సినిమాల్లో నటిస్తున్న వర్ష స్టార్ హీరోయిన్ గా అవలేక పోతుంది.

"""/"/ పైగా ఈ తొమ్మిదేళ్ల కాలంలో హీరోయిన్ అవ్వాలనే సంకల్పంతో మొదట్లో సహాయక పాత్రలో నటించడంతో ఆమెకు మెయిన్ లీడ్ పాత్రలు తక్కువ వచ్చాయి.

ఆ తర్వాత మెయిన్ లీడ్ ఆఫర్స్( Main Lead Roles ) వచ్చిన చిన్న హీరోల సరసన నటిస్తోంది.

అందుకే ఆమెకు తొమ్మిదేళ్ల సినిమా కెరియర్లో పెద్ద సినిమాలే మీ దక్కలేదు.ఇక ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) అనే చిత్రమైన ఆమెకు విజయాన్ని అందిస్తుందా లేదా అనేది మరికొద్దిగా గంటల పాటు వేచి చూస్తే తెలుస్తుంది.

కానీ వర్ష మాత్రం నిజానికి ఒక మంచి నటి.ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో బాగానే బండిని లాగుతుంది.

నటించడంలో చాలామంది హీరోయిన్స్ కన్నా ఆమె బెటర్.మరి ఇలాంటి అమ్మాయిలకు ఇండస్ట్రీ ఆఫర్స్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారనేది మాత్రం పెద్ద చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది.

నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి