లైట్స్ ఆపి మరి జర్నలిస్ట్ ని కొట్టిన వాణిశ్రీ ..నోరెళ్లబెట్టిన హీరో హరనాథ్

అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఆమె నాటి రోజుల్లో ఎన్టీఆర్ నుంచి అక్కినేని వరకు అందరు స్టార్ హీరో లతో కలిసి నటిచింది.

తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ ఇండస్ట్రీ లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించింది.

ఇక వాణిశ్రీ అసలు పేర రత్న కుమారి.మొన్న ఆ మధ్య కాలంలో వాణి శ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్ కార్తీక్ కార్డియాక్ అరెస్ట్ తో కన్ను మూసాడు.

వాణి శ్రీ డాక్టర్ కరుణాకరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆమె ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్సే.

వాణిశ్రీ కూతురు అనుపమ కూడా డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంది.ఇక ఆమె సినిమా జీవితం లో ఎంతో మంది తో నటించి మెప్పు పొందిన బయట ప్రపంచానికి తెలియని అనేక విషయాలు కూడా ఉన్నాయ్.

అందులో మీ అందరి కోసం ఇప్పుడు ఒక సంఘటన చెప్తాను.వాణిశ్రీ నిజానికి ఎంతో చక్కగా నటించి కళాభినేత్రి అనే బిరుదు సంపాదించుకుంది కానీ ఆమె పెద్దగా కలర్ మాత్రం ఉండరు.

కేవలం రంగు లేకపోయినా చక్కటి కల కలిగిన మొహం అని అలాగే బాగా నటిస్తుంది కాబట్టి అప్పటి మేకర్స్ ఆమెను ఎక్కువగా సినిమాల్లో బుక్ చేసుకునే వారు.

ఇంకా ఇదే విషయం అప్పట్లో మీడియాలో బాగా కనిపించేది.ఆమె తెల్లవారు జామునే లేచి బాగా మేకప్ చేసుకొని సినిమా లొకేషన్ కే వచ్చేవారని, """/"/ ఆమె నలుపు రంగు కనిపించకుండా చేతులు కళ్ళు కూడా మేకప్ తో ముంచెత్తే వారని కూడా ఎన్నో రూమర్స్ ఉండేవి.

అయితే నెల్లూరు కి చెందిన ఒక జర్నలిస్ట్ ఆమె వొంటి రంగు పై ఎన్ని విమర్శలు చేస్తూ హేళన చేసినట్టుగా ఒక ఆర్టికల్ రాసి పత్రిక లో వేసాడు.

అయితే అతడిని పిలిచి వ్యక్తి గత జీవితం మీడియా ముందు పెట్టడం సరికాదని మందలించి వదిలేసింది.

ఆ తర్వాత కూడా ఆమె కుటుంబ నేపథ్యం గురించి మరోమారు అవాకులు చెవాకులు రాసేసాడు.

"""/"/ అది మనసులో పెట్టుకుంది వాణిశ్రీ.ఆ తర్వాత ఒక రోజు హీరో హరనాథ్ మరియు జామున తో ఒక సినిమాలో నటిస్తున్న క్రమం లో హరనాథ్ ని కలవడానికి సదరు జర్నలిస్ట్ వచ్చాడు.

అప్పటికే బాగా మేకప్ వేసుకొని షాట్ కోసం వచ్చింది వాణిశ్రీ.అతడిని చూడగానే కోపం కట్టలు తెచ్చుకొని లైట్స్ ఆపేయమని చెప్పు తీసుకొని పడేలుమని కొట్టింది.

అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ జర్నలిస్ట్ ని మేకప్ రూమ్ కి తీసుకుపోయి కూర్చోపెట్టారు.

హరనాథ్ ఎదో అనబోతే వద్దని చెప్పి అక్కడ నుంచి వాణిశ్రీ వెళ్ళిపోయింది.ఆ తర్వాత ప్రొడ్యూసర్ బ్రతిమిలాడటం తో మళ్లి షూటింగ్ పూర్తి చేసింది.

మధుమేహం ఉన్నవారు బంగాళదుంప తినొచ్చా.. క‌చ్చితంగా తెలుసుకోండి..!