కొత్త బిల్డింగ్ కట్టే సమయంలో గ్రీన్ క్లాత్ ఎందుకు వాడుతరంటే..?

సాధారణంగా మనం పట్టణాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాన్ని చూస్తూనే ఉంటాం.అయితే ఈ మధ్య గమనిస్తున్నట్లైతే పెద్ద పెద్ద బిల్డింగులకు పచ్చ రంగు బట్టను కట్టి ఉంచుతారు.

గ్రీన్ క్లాత్ బిల్డింగు చుట్టూ వేయడం వల్ల వారికి ఎటువంటి లాభం ఉంటుందని చాలా మంది సందేశం.

అయితే దీన్ని కట్టడానికి ఒక ప్రత్యేక కారణమే ఉంది.అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పట్టణాల్లో మరియు నగరాల్లో పెద్ద క్రేన్లు, పెద్ద యాంత్రాల సహయంతో భవనాలు నిర్మిస్తుంటారు.

అయితే బిల్డింగులకు నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ ప్రదేశం చుట్టూ గ్రీన్ క్లాత్ కట్టి ఉంటుంది.

అలా గ్రీన్ కలర్ బట్టను కట్టడానికి గల కారణం ఎత్తులో పనిచేసే కార్మికులు దృష్టి కోల్పోకూడదు.

పనిచేసే కార్మికులు అనుకోకుండా అకస్మాత్తుగా ఎత్తులో నుంచి చూడడం వలన వారు పరధ్యానంలోకి వెళ్ళడం వారి ప్రాణాలకే ప్రమాదం.

అందుకే అలా వస్త్రాలను కడుతుంటారని కొంతమంది చెబుతుంటారు.అలాగే కన్ను దిష్టి భవనానికి తగలకూడదని, ప్రజల దృష్టి భవనాలపై పడకూడదని పచ్చ రంగు బట్టను కడుతుంటారని కొంత మంది చెబుతారు.

అయితే అసలు కారణం వేరే ఉంది.భవన నిర్మించే క్రమంలో దుమ్ము, సిమెంట్ భారీ మొత్తంలో నిర్మాణ స్థలంలో ఎగసిపడుతుంటాయి.

దీంతో చుట్టూ పక్కల నివసించే ప్రజలకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది.దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే పెద్ద పెద్ద భవనాలను నిర్మించేప్పుడు వాటి చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ కడుతుంటారు.

దీని వలన అక్కడ ఏర్పడే దుమ్ము, ధూళీ బయటకు రావు అయితే కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే ఎందుకు వాడతారు అనే సందేహం కూడా రావచ్చు.

ఇందుకు కారణం ఉంది.గ్రీన్ కలర్ అయితే ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంది.

అలాగే రాత్రి సమయంలో గ్రీన్ కలర్ కాంతి స్వల్పంగా ఉంటుంది.ఈ కారణాలతోనే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు గ్రీన్ కలర్ క్లాత్ వాడుతుంటారు.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి