వారిని అడ్డుకుని తీరుతాం..ట్రంప్ హెచ్చరికలు..!!

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలసదారుల రాకలు ఎక్కువగా అయ్యాయని ఒక నివేదిక గతంలోనే తేల్చింది అయితే ఈ నివేదికని మరోసారి నిజం చేస్తూ అమెరికాలోకి భారీ సంఖ్య లో వలసదారులు వేల సంఖ్యలో రావడం ట్రంప్ ప్రభుత్వాన్ని విస్మయానికి గురించేస్తోంది.

అసలే వలసలపై ఉర్రుగా ఉన్న ట్రంప్ ప్రస్తుత పరిస్థితి పై తీవస్తాయిలో మండిపడుతున్నారు.

సెంట్రల్‌ అమెరికా దేశాల నుండి వేలాదిమందిగా తరలి వస్తున్న శరణార్ధులను అమెరికాలోకి రాకుండా నిలువరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున సమాయత్తమవుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమెరికా-మెక్సికో సరిహద్దు పొడవునా దాదాపు 5,200మంది బలగాలను, ఆయుధాలను మోహరించినట్టు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

టెక్సాస్‌, అరిజోనా, కాలిఫోర్నియాలో 26 క్రాసింగ్‌ పాయింట్ల వద్ద వలసదారులని అడ్డుకునేందుకు తగు చర్యలు చేపట్టారు.

సుమారు 2,092 మంది నేషనల్‌ గార్డులు బలగాలకి సహకరించడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమెరికా సరిహద్దుల్లో వలస ప్రవేశాలని మరింత బలంగా చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.

రేజర్‌ వైర్‌తో అదనపు సరిహద్దు కంచెల నిర్మాణం, నాలుగు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు, అక్రమ ప్రవేశ పాయింట్లను కనుగొనేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు అన్నింటినీ సన్నద్ధం చేసినట్టు కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ కమిషనర్‌ కెవిన్‌ మెక్‌అలీన్‌ తెలిపారు.

రాత్రుళ్ళు కూడా పూర్తి సన్నద్ధత పాటించేలా మూడు హెలికాప్టర్‌ కంపెనీలను రంగంలోకి దించినట్టు ఆయన చెప్పారు.

అయితే ఎన్ని ప్రణాళికలు రచించినా సరే వలసదారులు ఎదో ఒక రూపంలో అమెరికాలోకి ప్రవేశించడం గమనార్హం.

రోడ్డు దాటుతూ వాహనదారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..