పవన్ కళ్యాణ్ వెనకాల టాలీవుడ్ ఇండస్ట్రీ అందుకే నిలబడటం లేదా ?
TeluguStop.com
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా ఇండస్ట్రీలో ఉంటే తన ఇంటి ముందు ప్రతిరోజు క్యూలో ఎంతోమంది నిలబడేవారు అడ్వాన్సులు పట్టుకొని నిర్మాతలు కథలు పట్టుకొని దర్శకులు వెంటపడి వెంటపడి వేదించేవారు.
కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో( Politics ) అడుగుపెట్టాడో అప్పుడే టాలీవుడ్ ఇరకాటంలో పడింది.
ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరు నోరు మెదపలేరు అలా అని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా ఉండలేరు ఇలా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద మనుషులందరికి.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ప్రస్తుతం జబర్దస్త్ నుంచి అందరూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు ఆ కమెడియన్స్ తమ పవన్ స్టార్ కోసం ప్రాణాలైనా ఇస్తాము అంటూ మాట్లాడుతున్నారు.
"""/" /
పవన్ కళ్యాణ్ కోసం ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ముందుకు వచ్చిన దాఖనాలు కనిపించడం లేదు.
మెగా కాంపౌండ్ నుంచి తన సొంత అన్నయ్య కాబట్టి చిరంజీవి( Chiranjeevi ) ఒక వీడియో సందేశాన్ని ఇచ్చాడు బాబాయి కాబట్టి తన తండ్రి వీడియోని రామ్ చరణ్( Ram Charan ) షేర్ చేశాడు.
ఇక నాగబాబుకు ఎలాగో తప్పదు ఎందుకంటే పార్టీలో ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి.
నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్ కి( Varun Tej ) కూడా తప్పలేదు ఎలాగైనా ఒకసారి ప్రచారం చేస్తే పని అయిపోతుంది కాబట్టి.
"""/" / సాయి ధరంతేజ్ కూడా వచ్చాడు తన మామయ్య కోసం తన వంతు ప్రచారం చేశాడు.
ఇక అల్లు అర్జున్ కి ( Allu Arjun ) పవన్ కళ్యాణ్ కి పెద్దగా పోసిగింది లేదు.
అందుకే వారి ఊసు ఎక్కడ కనిపించడం లేదు.అల్లు అరవింద్ అయితే మాట కూడా మాట్లాడటం లేదు.
అలా మెగా కాంపౌండ్ లోనే సగం మంది సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి దక్కడం లేదు మరి బయట పరిస్థితి ఇంకెలా ఉంటుంది చెప్పండి.
"""/" /
ఎలాంటి సంబంధం లేని బయట నుంచి సపోర్ట్ చేసిన ఒకే ఒక హీరో నాని.
( Hero Nani ) జగన్ ప్రభుత్వం పై కామెంట్స్ కూడా చేశాడు.
ఇంకా మిగతా వారి పరిస్థితి ఇలా లేదు.ఎందుకు జగన్ తో పేచి.
రేపు మళ్లీ గెలిచి జగన్ అధికారంలోకి వస్తే ఆయన చుట్టే ప్రదక్షిణాలు చేయాలి.
లేకపోతే ఓడిపోయినా కూడా టిడిపి కూటమి పెద్దగా చేసేది ఏమీ ఉండదు అనేది కొంతమందిలో కనిపిస్తున్న మాట.
అందుకే మనకేం సంబంధం లేదు అన్నట్టుగా అందరూ సైడ్ అయిపోయారు.అందుకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వెనకాల టాలీవుడ్ నుంచి ఒక్క పెద్ద మనిషి కూడా లేడు.
అందుకు పవన్ కళ్యాణ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.తనదైన ప్రపంచం లో తాను ఉంటాడు.
ఎప్పుడు ఎవరితో సరిగా మాట్లాడడు.పార్టీ నిర్మాణంలో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి.
సరైన ఎజెండా కనిపించడం లేదు.ఇవన్నీ చూస్తే ఎవరికీ పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది చెప్పండి.
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి