మన హీరోలు ఇలా చేస్తే ఇంకా నేషనల్ అవార్డులు ఎలా వస్తాయి ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సినిమాలు ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

ఎందుకంటే మన సినిమాల్లో కామెడీ, యాక్షన్, రొమాన్స్, హారర్, సెంటిమెంట్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.

అలాగే ప్రేక్షకులకు నచ్చే, సక్సెస్ అయిన ఫార్ములాలోనే స్టార్ హీరోలు సినిమాలు తీస్తుంటారు.

పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లరు.చిరంజీవి ( Chiranjeevi )నుంచి సాయి ధరమ్‌ తేజ్ వరకు అందరూ కమర్షియల్ సినిమాలు తీసేసి హిట్స్ సాధించాలని చూస్తున్నారు తప్ప డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీసి ఆడియన్స్ కు కొత్త రకం అనుభూతిని అందించాలని కోరుకోవడం లేదు.

తెలుగులో స్టార్ హీరోల నుంచి కమర్షియల్ సినిమాలు తప్పితే వేరే సినిమాలు ఎక్కువగా ఆశించలేం.

"""/" / మరోవైపు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్( Mohanlal ), సూర్య, ధనుష్‌ లాంటి హీరోలు భిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు.

అంతేకాదు జాతీయ సినిమా పురస్కారాలు కూడా అందుకుంటున్నారు.కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వరస్ట్ రికార్డు వచ్చింది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్( Allu Arjun ) చాలా బాగా నటించాడు కాబట్టి అతనికి నేషనల్ అవార్డు లభించింది.

బన్నీ ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా కూలివాడిలాగా, ఎర్రచందనం స్మగ్లర్ లాగా నటించాడు.

స్టార్ పవర్ కోసం పాకులాడలేదు.అందరి హీరోలకు భిన్నంగా కనిపించాడు.

అందుకే అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డు వరించింది.చాలా ఏళ్ల పాటు నేషనల్ అవార్డు అందుకోలేక తెలుగు పరిశ్రమ సతమతమయింది.

ఆ నిరీక్షణకు బన్నీ చెక్ పెట్టాడు. """/" / అయితే మొన్నటిదాకా ఒక మూస ధోరణిలో వెళ్లిన హీరోలు ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటికి వస్తున్నారు.

ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు.అందువల్ల నేషనల్ అవార్డ్స్ మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ కూడా సమీప భవిష్యత్తులో తెలుగు హీరోలను వరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల వచ్చిన కల్కి సినిమా( Kalki ) చాలా డిఫరెంట్ గా ఉండి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇలాంటి భిన్నమైన కథలు, విజువల్ ఎఫెక్ట్స్‌కు నేషనల్ అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

హీరోలు ఇప్పుడిప్పుడే మారుతున్నారు కాబట్టి వేరే ఇండస్ట్రీలతో సమానంగా నేషనల్ అవార్డ్స్ తెలుగు పరిశ్రమకు కూడా వస్తాయని ఆశించవచ్చు.

తమిళ, మలయాళ హీరోలు మాత్రమే కాదు తెలుగు హీరోలు కూడా మంచి నటులే అని సగర్వంగా చెప్పుకునే రోజులు ఇంకెంతో దూరంలో లేవు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్‌కు భారత సంతతి బిలియనీర్ సపోర్ట్