తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?

ఇండియాలోని అనేక భాషల్లో అనేక సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి.తెలుగు వారికి టాలీవుడ్ , తమిళవారికి కోలీవుడ్, కన్నడ వారికి శాండిల్ వుడ్ ఇలా ప్రతి భాషకు వారికంటూ ఒక ప్రాధాన్యత, అలాగే వారి సినిమాలకు ఒక అసోసియేషన్ కూడా ఉంటాయి.

అయితే ఇప్పుడు ఇండియా లెవెల్ లో టాలీవుడ్ మంచి స్థాయిలో ఉంది.పైగా పాన్ ఇండియా సబ్జెక్ట్స్ మొత్తం టాలీవుడ్ నుంచి వస్తు విజయాలను అందుకుంటున్నాయి.

తమిళ్ తో పోలిస్తే ఒకప్పుడు తెలుగు వారిని చాలా చిన్న చూపు చూసేవారు.

సౌత్ ఇండియాలో తమిళ్ మొదటి వరుసలో ఉండేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

ఇండియాలోనే అందరిని దాటి తెలుగువారు ముందుకు వెళ్లిపోయారు.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఎన్ని సినిమాలు తీశామన్నది ముఖ్యం కాదు ఎంత భిన్నంగా చిత్రాలను ఇచ్చాము అలాగే ఎన్ని అవార్డ్స్ అందుకున్నాము అన్నదే ముఖ్యం.

ఒకప్పుడు అవార్డు అంటే చాలా గొప్ప కానీ ఇప్పుడు అవార్డ్స్ కొనుకుంటున్నారు అన్న పేరు అయితే వచ్చింది.

"""/" / అయితే ఇప్పటి పరిస్థితులను పక్కన పెట్టి కాస్త వెనక్కి వెళ్లిన తమిళ వారి సినిమాల్లో మరియు తెలుగు సినిమాలకు ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

తెలుగు కన్నా కూడా అద్భుతమైన సినిమాలు తమిళ్ లో మొదట్లో వచ్చేవి.అలాగే అక్కడి హీరోలకి కూడా ఎక్కువ అవార్డ్స్ కూడా ఉన్నాయి.

ఉదాహరణకి కమల్ హాసన్ ని తీసుకుంటే ఆయనకు మూడు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి.

కానీ మనం ఒక అవార్డు దక్కించుకోవడానికి కింద మీద పడుతున్నాం.ఆయన తీసుకునే ప్రతి స్క్రిప్ట్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

అలాగే కమల్ నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.కమల్ హాసన్( Kamal Haasan ) తర్వాత తమిళ్ లో ఎక్కువ అవార్డ్స్ ఉన్న హీరో ధనుష్( Dhanush ).

ను కూడా ప్రతి పాత్ర కోసం ఎంతో ఎఫెక్ట్ పని చేస్తాడు.అందువల్లే అతనికి రెండుసార్లు నేషనల్ అవార్డ్స్ దక్కాయి.

</br """/" / ఇక హీరో విక్రమ్ కూడా మంచి నటుడు.ప్రతిపాత్ర కు ప్రాణం పోసి దాని నిలబెట్టగల హీరో.

ఆయన ఒకసారి నేషనల్ అవార్డు అందుకున్నాడు.అలాగే సూర్య కూడా ఒకసారి నేషనల్ అవార్డు అందుకున్నారు.

వీరిద్దరూ కూడా తమిళనాడు లో ప్రస్తుతం మంచి హీరోలుగా కొనసాగుతున్నారు.ఎంతో విభిన్నమైన సినిమాలను చేస్తూ ముందుకు వెళుతున్నారు.

ఓవైపు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూనే మరోవైపు కమర్షియల్ పాత్రలతో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇలా రెండు విభిన్నమైన కోణాలని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా తక్కువ మంది హీరోల వల్లే అవుతుంది.

కానీ మరి ఇంత మంది తమిళ హీరోలకు అవార్డులు వస్తే మనకు ఓన్లీ అల్లు అర్జున్ కు మాత్రమే వచ్చింది.

మరి దీని గురించి కచ్చితంగా తెలుగు రైటర్స్ అలాగే డైరెక్టర్స్ మేకర్స్ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.

లావణ్య విషయం లో మరోసారి క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్…