వెంకటేష్ నటించిన ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడానికి కారణం అదే?

సాధారణంగా మన తెలుగు పరిశ్రమలో సినిమా హీరోల అభిమానులు అనేవారు గ్రూపులుగా విడిపోవడం అందరికీ తెలిసిందే.

అయితే కొంతమంది హీరోలు మాత్రం దానికి మినహాయింపు అనే చెప్పుకోవాలి.అందులో ముందు వరుసలో వుంటారు హీరో విక్టరీ వెంకటేష్( Hero Victory Venkatesh ).

అవును, ఆయనని ఇక్కడ ఇష్టపడని వారంటూ ఎవరూ వుండరు.వెంకీ సినిమా వచ్చిదంటే చాలు.

ఇంటిల్లిపాదీ వెళ్లి ఆ సినిమాని చూసి తీరతారు.అయితే ఎలాంటి హీరోకైనా ఇక్కడ జయాపజయాలు అనేవి సహజం.

అలా హీరో వెంకటేష్ చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అందులో ముఖ్యంగా చింతకాయల రవి, నమో వెంకటేశా ( Chintakayala Ravi, Namo Venkatesa )లాంటి కామెడీ సినిమాలు కూడా వున్నాయి.

"""/" / వాటికి కారణం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.ఆ దర్శకులు చేసిన మిస్టేక్స్ వల్లే ఈ సినిమాలనేవి పెద్దగా ఆడలేదనేది వాస్తవం.

వెంకటేష్ కామెడీ సినిమాలు( Comedy Movies ) నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఈమాదిరి ఆడియో అందరికీ తెలిసినదే.

కానీ మొదట చెప్పుకున్న రెండు సినిమాల్లో మాత్రం కథతో సంబంధం లేకుండా కామెడీని పండించే ప్రయత్నం చేశారు.

అందుకనే అవి ఆడలేదనేది అందరికీ తెలిసినదే.ఇక ఈ సినిమాల్లో కథ కూడా చాలా దారుణంగా ఉంటుంది.

మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అసలు కథ అనేదే ఉండదు.

అందువల్లే ఈ రెండు సినిమాలు కామెడీ జానర్ లో తెరకెక్కిన కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అనేది విశ్లేషకుల మాట.

"""/" / ముందుగా ఈ రెండు సినిమాలు వెంకటేష్ చేయాలా, వద్దా అని బాగా ఆలోచించినప్పటికీ కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారు అనే ఉద్దేశంతోనే ఈ సినిమాలకి సైన్ చేసాడట.

ఇదే విషయాన్ని అయన మొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు.కాగా ఈ సినిమాలు మాత్రం తన కెరియర్ ను ఏ మాత్రం ముందుకు తీసుకెళ్ళలేక పోగా, ఆయన మార్కెట్ ను భారీగా డౌన్ చేశాయని పరిశీలకులు అంటున్నారు.

ఇకపోతే వెంకటేష్ వంటి హీరో ఏ జానర్ కధలో అయినా ఇమిడిపోతాడు.అలాగని వెంకటేష్ ను పెట్టి నాసిరకం కథలతో సినిమాలు చేస్తే అది అటు దర్శకులకు ఇటు హీరోకు ఓ చేదు జ్ఞాపకంలా మారిపోక తప్పదు.

ఇప్పటికైనా మన టాలీవుడ్ దర్శకులు కొందరు మారి ఒక మంచి కథతో ఆయనతో సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!.

సూర్య కంగువా సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ కి పాన్ ఇండియా సక్సెస్ ను ఇస్తాడా..?