ఈ యువ హీరోలకు.. ఇంత నెగిటివిటీ ఎందుకో?

సినిమా అనే రంగుల ప్రపంచంలో అందరి భవిష్యత్తును నిర్ణయించేది కేవలం వంద రూపాయలు పెట్టి టికెట్టు కొనుక్కొనే ప్రేక్షకుడు మాత్రమే.

స్టార్ హీరో అవ్వాలి అన్న.కనుమరుగు అవ్వాలి అన్న అది కూడా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది.

ఎందుకంటే దర్శక నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీసినా ప్రేక్షకులకు నచ్చకపోతే మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోతుంది.

ఈ క్రమంలోనే ప్రేక్షకులు కొంతమందికి బ్రహ్మరథం పడితే మరికొంత మంది మాత్రం వ్యవహార శైలి నచ్చక పక్కన పెడుతూ ఉంటారు.

 దానికి రకరకాల కారణాలు ఉన్న, స్వయంకృపరాధం తో కూడా కొంత నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు కొంత మంది హీరోలు.

ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసిన పనికి హీరో కిరణ్ అబ్బవరం ట్రోలర్స్ చేతికి చిక్కాడు.

సాధారణంగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెబుతూ ఇక ఈ రోజుల్లో అంతటి గొప్ప క్రేజ్ సంపాదించే హీరో కిరణ్ అబ్బవరం మాత్రమే అంటూ చెప్పాడు.

ఇది పవన్ కల్యాణ్ అభిమానులకు నచ్చలేదు.దీంతో హీరో కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు.

మరోవైపు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ ఒక సినిమా ఈవెంట్లో ఈవెంట్ లో రిలాక్సు గా కూర్చుని ఉంటే పక్కనే మరో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాత్రం వినయంగా పద్ధతిగా కూర్చున్నారు.

ఈ రెండు ఫోటోలను బండ్ల గణేష్ జాయింట్ చేసి పోస్ట్ చేయడంతో ఇక ఈ పోస్ట్ కాస్త సంచలనంగా మారిపోయింది.

ఎంతో పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ అంత వినయంగా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న చిన్న హీరోలకు ఆటిట్యూడ్ ఎందుకో అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

"""/"/ ఇక ఇటీవలే లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు అనే విషయం తెలిసిందే.

ఇక మరో యువహీరో విశ్వక్ సేన్ సైతం తన కెరీర్లో ఇప్పటి వరకు ప్రతి సినిమా విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు అని చెప్పాలి.

 ఇక ఇదే వైఖరి కొనసాగితే రానున్న రోజులు ఖచ్చితంగా గడ్డు కాలమే అని చెప్పక తప్పదు.

ఇకనైనా బుద్ది తెచ్చుకొని పద్ధతి గా మసలుకుంటే మంచిది అని ఒక వర్గం సినీ ప్రేమికులు భావిస్తున్నారు.

క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!