Sneha, Anjali Zaveri : ఈ హీరోయిన్స్ ఎందుకు స్టార్ హీరోయిన్స్ అవ్వలేకపోయారంటే..?

సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ఏం మంచి నటులుగా నటీమణులు గా పేరు తెచ్చుకున్నప్పటికి స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందలేరు అలాంటి వాళ్లలో ముఖ్యంగా వినిపించే పేర్లు వీళ్ళవే.

తెలుగింటి ఆడపడుచులా అచ్చ తెలుగు అమ్మాయిలా చూడగానే తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించేలా ఉండే ఏకైక నటి తెలుగులో స్నేహ అనిపిస్తుంది.

అయితే ఈమె కంటే ముందు సౌందర్య పేరు తెచ్చుకున్నప్పటికీ సౌందర్య మరణించాక స్నేహనే అచ్చ తెలుగు ఆడపిల్లలా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఈ హీరోయిన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎలాంటి ఎక్స్పోజింగ్లకు పోకుండా గ్లామర్ పాత్రల్లో నటించకుండా హద్దులు మీరకుండా చాలా పద్ధతి గల పాత్రల్లో నటించింది.

"""/" / ఎక్కువగా ట్రెడిషనల్ గల పాత్రల్లో నటించేసరికి చాలామంది స్టార్ హీరోలు స్నేహ ని లైట్ తీసుకున్నారట.

ఎందుకంటే సినిమాల్లో మాస్ మసాలా అన్నీ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు.అయితే తమ సినిమాల్లో స్నేహను తీసుకుంటే రొమాన్స్ అంతగా ఉండదు.

అలాగే ఒకవేళ ఆమె అలాంటి పాత్రల్లో నటించినా కూడా ప్రేక్షకులు అంగీకరించరు.ఆ కారణంతో స్నేహా( Sneha ) ని చాలామంది స్టార్ హీరోలు తీసుకునే వారు కాదట.

అంతేకాకుండా స్నేహ భర్త కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఓ సినిమాలో నటించే టైంలో ఆయనతో ప్రేమలో పడిందట.

అయితే ప్రేమలో పడ్డప్పటినుండి కూడా స్నేహాని తన భర్త ఎలాంటి గ్లామరస్ పాత్రల్లో నటించకూడదు అని కండిషన్లు పెట్టారట.

ఈ కారణంతో కూడా స్నేహ కొన్ని సినిమాల్లో అవకాశాలు కోల్పోయిందట. """/" / ఒకవేళ ఆ సినిమాలు గనక చేసి ఉంటే చాలా రోజులు స్నేహ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండేదట.

కానీ ఆమె దురదృష్టం వల్ల ఆ సినిమాల్లో ఛాన్సులు వచ్చినా కూడా భర్త పెట్టిన కండిషన్ ల వల్ల రిజెక్ట్ చేసిందట.

అలా ట్రెడిషనల్ హీరోయిన్( Traditional Heroine ) గానే పేరు తెచ్చుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ వదిన పాత్రలో నటించింది.

ఇక ఈమె తర్వాత చెప్పుకొంటే హీరోయిన్ అంజలి జవెరి( Anjali Zaveri ) ఈమె వెంకటేష్ హీరో గా వచ్చిన ప్రేమించు కుందాం రా సినిమా లో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయింది.

ఆ తర్వాత బాలయ్య చిరంజీవి నాగార్జున లాంటి స్టార్ హీరోల పక్కన నటించిన గ్లామరస్ పాత్రలు పోషించిన కూడా ఈమె స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది.

ఆ కన్నడ హీరో నాతో మిస్ బిహేవ్ చేశాడు.. సంజన సంచలన వ్యాఖ్యలు వైరల్!