క్రేజీ కాంబినేషన్స్.. కానీ కనిపించకుండా పోయాయ్?
TeluguStop.com
సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఏవైనా కాంబినేషన్ లు తెర మీదికి వచ్చాయంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా ఇక ఆ కాంబినేషన్ గురించి చర్చించుకుంటూ ఉంటారు.
అయితే ఇలా తెరమీదికి వచ్చిన కొన్ని కాంబినేషన్స్ మాత్రం అటూ అతకేక్కుతూ ఉంటాయి.
మరికొన్ని షూటింగ్ లు ప్రారంభమైన తర్వాత ఎందుకో మధ్యలో ఆగిపోతుంది.ఇప్పుడు అలాంటి సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యువ దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాను తీసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు.అయితే అంతకు ముందే స్టార్ హీరో అల్లు అర్జున్ తో దాదాపు ఐదేళ్ల కిందట ఒక సినిమా చేశాడు.
అదే ఐకాన్.కానీ ఈ సినిమా ఇప్పటివరకు అడ్రస్ లేదు.
ఉంటుందా లేదా అన్నది కూడా ఎప్పుడూ అనుమానంగానే మారిపోయింది. """/" /
వెంకటేష్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఒక సినిమాని ప్రకటించారు.
హైదరాబాద్ రేస్ క్లబ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని తరుణ్ భాస్కర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసాడు.
సినిమా అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు.ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా లేనట్లే కనిపిస్తోంది.
ఇక మంచు విష్ణు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీ ఢీ సినిమా కు సీక్వల్ ప్రకటించారు.
ఈ సినిమా ఊసే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ వినిపించడం లేదు. """/" /
వి.
వి.వినాయక్ హీరోగా మారిపోయి నరసింహ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కింది.
దీని కోసం డైరెక్టర్ వి.వి.
వినాయక్ వెయిట్ లాస్ అయ్యి ఇక కండలు కూడా పెంచాడు.సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
శీనయ్య అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.సినిమా చివరికి అటకెక్కింది.
విజయ్ దేవరకొండ హుషారు డైరెక్టర్ హరీ కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారు ఈ సినిమా కూడా పక్కకు వెళ్లి పోయింది అని తెలుస్తోంది.