ఇలాంటి తెలుగు సినిమా మీద ఈరకమైన చర్చె జరపరెందుకు?

ఈ మధ్య వచ్చిన ఓ మాదిరి తెలుగు సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

అసలే మన రౌడీ హీరో ( Rowdy Hero )వరుసగా బక్కబోర్లా పడుతున్న పరిస్థితి.

అలాంటి క్రేజీ హీరోకి అలాంటి కథని ఎలా చెబుతారు.పోనీ ఆ కథను బాబు ఎలా యాక్సెప్ట్ చేశాడో ఆ దేవుడికే తెలియాలి.

పైగా మనోడు కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వలేను, బడ్జెట్ లెక్కలు వర్కవుట్ కావు అని మరో కంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఇస్తూ కనబడతాడు.

మరి ఏ బడ్జెట్ లెక్కల్లో తేజ సజ్జ హనుమాన్ సినిమాని చేసాడు? సింపుల్.

కథలో దమ్ముండాలి.ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి.

అన్నింటికి మించి తమ అభిమాన హీరోలు తనని ఎలా అయితే చూడాలని ఆశ పడుతున్నారో అదే విధంగా హీరోలని చూపించాలి తప్ప, ఏదో పిచ్చి కథను జనం మీద రుద్దుదాములే అనుకుంటే జనం ఒకప్పటిలా పిచ్చోళ్లు అయితే కాదు.

నచ్చకపోతే మొదటి ఆటతోనే మడతెట్టేస్తారు మరి. """/" / ఒక కల్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న రౌడీ బాబుకి రాముడు మంచి బాలుడు అన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ కావు.

పోనీ ఆ సినిమా ఎమన్నా నేటి స్టయిల్లో తీసారా అంటే? లేదు.ఏదో బీసీ కాలంలో తీసినట్టు తీశారు.

ముద్ద పప్పు హీరోలే జంతువులుగా మారిపోతున్న వేళ, ఆల్రెడీ తెలుగు జంతువుగా నిరూపించుకోబడిన హీరోను ముద్దపప్పులెక్క చూపిస్తే ఇలాగే లెక్కలు మారుతాయి.

ఇక్కడ సదరు హీరోలైనా జాగ్రత్తలు తీసుకోక పోతే ఎలా? మొన్నామధ్య టైగర్ కాని మరేదో జంతువుతో బొక్కబోర్లా పడినోడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనోడు కుర్రకారుకి ఆల్రెడీ ఒక ఇమేజ్ రుచి చూపించాడు.

ఇపుడు ఆ దారి మళ్ళి వేరే రూట్లో వెళ్తే పయనించడం కష్టమే. """/" / అయినా, 1960ల్లోని సినిమా కథకు ఎంత తాళింపు పెడితే అది 21వ శతాబ్దపు కథ అవుతుందా? ఆ గెటప్ కూడా జనాలకి, సారీ అభిమానులకి మింగుడు పడలేదు పాపం! కొత్త వాళ్లను ట్రై చేయొచ్చు కదా.

టాలీవుడ్లో, డైరెక్షన్ డిపార్టుమెంటులో, క్రియేటివ్ జీనియస్ పిల్లలు అనేకమంది ఉన్నారు.సమాజలో బోలెడు సమస్యలున్నాయి.

వాళ్ళకో ఛాన్స్ ఇస్తే ఇలాంటి హీరోలు దూసుకుపోతారు.అలా కాకుండా మన దగ్గర సరుకు లేక రివ్యూ రాసిన వాళ్ళ మీద సీరియస్ అయితే ప్రయోజనం ఏం లేదు.

థియేటర్ పక్కన పెడితే ఇపుడు అమెజాన్లో చూసే వారినెవరినీ రివ్యూలు ప్రభావితం చేయలేవు అని తెలుసు కదా! అవును, ఇప్పుడొచ్చిన స్పందనే నిజమైన స్పందన!.

నాపై కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తారు…. జబర్దస్త్ షోపై ఇంద్రజ కామెంట్స్!