మూడు రాజధానులపై ఎందుకింత రచ్చ? ..స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజధానుల వ్యవహారం రోజురోజుకు హీటెక్కుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా స్పీకర్ తమ్మినేని మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులపై ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ ప్రశ్నించారు.అమరావతి ఉద్యమం కలుషితమైన ఉద్యమం అన్నారు.

రైతుల పేరుతో బినామీ యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదని ఆరోపించారు.

కోర్టు ప్రశాంతంగా ర్యాలీ చేయమంటే తొడలు గొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ ప్రపంచ నగరమన్న ఆయన అమరావతిలా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు.

అనుచితంగా మాట్లాడే పవన్ కల్యాణ్ ఏం నాయకుడు అని ప్రశ్నించారు.ఆయనకు రాజకీయ పార్టీ నేతకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు.

ఒక నాయకుడు అయి ఉండి చెప్పు చూపడమేంటన్నారు.పవన్ సీఎం కావాలనుకుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?